సంధ్యా ధియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటీషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. అల్లు అర్జున్ బెయిల్ పిటీషన్ పై నేడు పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. గత విచారణలో అర్జున్ పిటీషన్ పై కౌంటర్ వేయడానికి పోలీసులు న్యాయస్ధానాన్ని గడవు కోరారు. ప్రస్తుతం మధ్యంతర బెయిల్లో ఉన్న అల్లు అర్జున్ రిమాండ్ గడువు ముగియడంతో ఇటీవల వర్చువల్ గా కోర్టు విచారణకు హజరయ్యారు. కోర్టు తదుపరి విచారణను జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది. డిసెంబర్ 4వ తేదీ పుష్ప2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా ధియేటర్ ప్రారంగణంలో తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తొక్కిసలాట విషయంలో కేసు దాఖలు చేసిన చిక్కడపల్ల పోలీసులు ఏ11 గా ఉన్న అల్లు అర్జున్ని డిసెంబర్ 13వ తేదీ అరెస్ట్ చేశారు. అంతకు ముందే తనపై చిక్కడపల్లి పోలీసులు పెట్టిన కేసు కొట్టివేయాలని హైకోర్టులో అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పై విచారణ కొనసాగుతోంది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు నాంపల్లి కోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు ఈ కేసులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేసిన తరువాత విచారణ జరిగనుంది.