30.8 C
Hyderabad
Thursday, June 25, 2026

Live Video

spot_img

మోదీని దించే కుట్ర జరిగిందా? ట్రంప్ చెబుతున్నదేంటి?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్‌గా ఉన్నారు. ఆయన లెటెస్ట్‌గా చేసిన సంచలన ఆరోపణ.. భారత్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఓడించేందుకు కుట్ర జరిగిందని. అది కూడా అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ చేశారని. అయితే ఈ విషయాన్ని డైరెక్ట్‌గా చెప్పలేదు. భారత్‌లో ఓటర్ టర్నవుట్‌కు అమెరికా 21 మిలియన్ డాలర్ల నిధులు ఇచ్చింది. అయితే ఈ నిధులను భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు బైడెన్ ప్రయత్నించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

భారత్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు మనమెందుకు డబ్బులు ఇవ్వాలి.. నాకు తెలిసి ఆ దేశంలో మరెవరినో గెలిపించేందుకు బైడెన్ ప్రయత్నించినట్టు అర్థమవుతుంది. మనం ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తెలియజేయాలి.. అంటూ వ్యాఖ్యలు చేశారు ట్రంప్.

నిజానికి ఈ నిధుల విషయంలో గతంలో కూడా ట్రంప్‌ మాట్లాడారు. భారత్ వద్ద బాగా డబ్బు ఉందని.. వారికి ఎలాంటి నిధుల అవసరం లేదన్నారు. ఆ దేశ ప్రధానిపై, అక్కడి ప్రజలపై నాకు చాలా గౌరవం ఉందని.. కానీ వారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు ట్రంప్.

ట్రంప్ చేసిన ఆరోపణలు చాలా ఆలోచించాల్సినవే అని చెప్పాలి. అయితే ట్రంప్ ఇప్పుడు కేవలం అమెరికా గురించి తప్ప.. మరేవ్వరి గురించి ఆలోచించే పరిస్థితిలో లేరు. అంతేకాదు తాను అమెరికా కోసమే పనిచేస్తున్నానని చెప్పుకునేందుకు చాలా తాపత్రయపడుతున్నారు. అందుకే అమెరికా అందించే నిధులను, సాయాలను ఆపేశానని పదే పదే ప్రజలకు గుర్తు చేస్తున్నారు. దీంతో ఆయన అమెరికా ప్రజల మన్ననలు పొందేందుకు చేసే వ్యాఖ్యలు ఇతర దేశాల్లో మెయిన్‌ హెడ్‌లైన్స్‌గా మారుతున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com