33.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

లైలా పాలిట విలన్ గా మారిన కమెడియన్

నోరు బాగుంటే ఊరు బాగుంటదని ఓ సామెత. అది ఎంత నిజమే తెలిసొచ్చే సందర్భాలు జీవితంలో అప్పుడప్పుడూ తారసపడుతుంటాయి. ఐతే.. ఒకరి నోటిదూల మరొకరికి సమస్యలు తెచ్చిపెడితే.. అది మరీ దారుణం. లైలా మూవీ విషయంలో అదే జరిగింది.
లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ పృథ్వి అసందర్భంగా, అనవసరంగా నోరు జారాడు. 11 మేకలు అని వైసీపీని ఉద్దేశించి మాట్లాడాడు. దాంతో బయ్ కాట్ లైలా అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ లు హల్ చల్ చేశాయి. సినిమా రిలీజ్ కాకముందు నుంచే డిజాస్టర్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ కూడా తెగ వైరల్ అయింది. దాంతో హీరో విశ్వక్ సేన్ హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టాడు. పృథ్వీ అలా మాట్లాడటం తప్పే అని సారీ కూడా చెప్పాడు. ఐతే.. ప్రెస్ మీట్ ముగిసిన కొన్ని గంటలకే తన అఫీషియల్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో ఓ పిక్ ను అప్ లోడ్ చేశాడు విశ్వక్. అది వేలు పైకి చూపిస్తూ వెటకారంగా ఉంది. దాంతో విశ్వక్ పెట్టిన ప్రెస్ మీట్ కేవలం ఓ డ్రామా అని తేలిపోయింది. ఇక వైసీపీ అభిమానులు మరింతగా రెచ్చిపోయారు. లైలా మూవీపై తెగ ట్రోల్స్ జరిగాయి.

ఇక లవర్స్ డే గిఫ్ట్ గా ఫిబ్రవరి 14న రిలీజైన లైలా ఫస్ట్ షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో బయ్ కాట్ లైలా అంటూ ట్రోలింగ్ జరగటంతో అడ్వాన్స్ బుకింగ్ పెద్దగా జరగలేదు. బుక్ మై షోలో కేవలం 9 వేల టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీంతో సినిమా విజయం కోసం కంప్లీట్ గా మౌత్ పబ్లిసిటీ పైనే ఆధారపడాల్సి వచ్చింది. ఐతే.. మొదటి షో పడిన వెంటనే నెగిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ దారుణంగా పడిపోయాయి. లైలా థియేటర్స్ అన్నీ ఖాళీగా దర్శనమిస్తు న్నాయి. మొత్తానికి లైలా మూవీపై విమర్శకులు దుమ్మెత్తిపోస్తున్నారు. వల్గర్ కామెడీ అంటూ ప్రేక్షకులంతా విరుచుకుపడుతున్నారు. పృధ్వీ కామెంట్స్ వల్ల ఈ మూవీకి భారీ గానే దెబ్బతగిలింది. గతంలో కూడా కమెడియన్ పృధ్వి ఇలాగే ప్రవర్తించాడు. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా నోరు జారాడు. ఐతే.. ఈసారి పృధ్వీకి గట్టి దెబ్బే తగిలింది. ఐనాకానీ అతని ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. ఈ కామెంట్స్ చేసిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడుతూ బూతులతో రెచ్చిపోయాడు పృధ్వీ. కేసులు పెట్టి తెగ హడావిడి చేశాడు.

సినిమా ఫంక్షన్స్ లో రాజకీయలు మాట్లాడటం కరెక్ట్ కాదని ఎంతమంది హితబోద చేస్తున్నా కొందరికి మాత్రం అది తలకెక్కటం లేదు. ఆ ప్రభావం సినిమా రిజల్ట్ పై పడుతుందని ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. కంటెంట్ లేకుండా సినిమాలు చేస్తే ఆడవని హీరోలు కూడా రియలైజ్ అయితే బెటర్. పబ్లిసిటీ జిమ్మిక్కులు వర్కవుట్ కావని తెలుసుకోవాలి. నిర్మాత సాహూ గారపాటి లైలా చిత్రాన్ని 35 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాడు. లెక్కలు చూసుకోవాల్సిన అవసరం కూడా లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. ఈ సినిమాకి అసలు కలెక్షన్లే లేవు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com