తెలుగు రాష్ట్రాల నుంచి హైకోర్టు న్యాయమూర్తులుగా సిఫారసు చేస్తూ ఏపి, తెలంగాణ కొలీజియంలు నిర్ణయం తీసుకున్నాయి. రికార్డు స్థాయిలో తెలంగాణ నుంచి నలుగురిని సిఫారసు చేయగా…ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరిని సిఫారసు చేశాయి.
ఆంధ్రప్రదేశ్ నుంచి అవధానం హరినాథ శర్మ, ఎడవల్లి లక్ష్మణ రావు పేర్లను పదోన్నతి కోసం కొలీజియం ఎంపిక చేసింది. తెలంగాణ నుంచి యార రేణుక, నందికొండ నర్సింగ్ రావు, ఈద తిరుమల దేవి అలియాస్ కె తిరుపతమ్మ, మధుసూధన్ రావు బొబ్బిలి రామయ్య పేర్లను సిఫారసు చేశారు.
న్యాయశాఖలో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న వారిని రెండు రాష్ట్రాల కొలీజియంలు హైకోర్టుకు పదోన్నతి కల్పించే దిశగా సిఫారసు చేశాయి. ఈ నెల పదకొండో తేదీన కొలీజియం సమావేశం జరగగా ఈ రోజు సిఫారసు చేయటం జరిగింది.