25.4 C
Hyderabad
Monday, November 2, 2026

Live Video

spot_img

స్మృతి రికార్డుల మోత

  • టీమ్ ఇండియా భారీ స్కోరు 435/5
  • ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత మహిళా ప్లేయర్ గా స్మృతి
  • ఓపెనర్ల రికార్డు భాగస్వామ్యం

టీమ్ ఇండియా వుమెన్స్ క్రికెటర్లు పండగ రోజున దంచి కొట్టారు. రికార్డుల మోత మోగించారు. అభిమానులకు సంక్రాంతి కానుక అందించారు. ముఖ్యంగా కెప్టెన్ స్మృతి మంథాన రికార్డుల వరద సృష్టించింది. కేవలం 70 బంతుల్లో సెంచరీ సాధించి ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత మహిళా ప్లేయర్ గా నిలిచింది.

రాజ్ కోట్ వేదికగా ఐర్లాండ్ తో బుధవారం జరిగిన మూడో వన్డేలో భారత జట్టు ఓపెనర్లు కెప్టెన్ స్మృతి 80 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేసింది. మరో యువ ఓపెనర్ ప్రతికా రావెల్ 129 బంతుల్లో 20 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 154 పరుగుల బంపర్ స్కోర్ చేసి ఔరా అనిపించింది. వీరిద్దరూ మొదటి వికెట్ కి రికార్డు భాగస్వామ్యం 233 పరుగులు చేశారు. ఇది భారత మహిళా జట్టులో ఏ వికెట్ కైనా మూడో అత్యధిక భాగస్వామ్యంగా రికార్డులకెక్కింది.

మ్యాచ్ విషయానికి వస్తే, టాస్ గెలిచిన టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు అదరగొట్టారు. వారి తర్వాత రిచాఘోష్ (59), తేజల్ (28), హర్లీన్ డియోల్ (15) చేశారు. జెమిమా (4), దీప్తీ శర్మ (11) నాటౌట్ గా నిలిచారు. మొత్తమ్మీద 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసి రికార్డుల మోత మోగించారు.

ఐర్లాండ్ బౌలింగులో ఓర్లా 2, కెల్లీ 1, ఫ్రేయ సార్జెంట్ 1, జార్జినా 1 వికెట్లు తీశారు.

అనంతరం లక్ష్య ఛేదనలో పిల్ల జట్టు ఐర్లాండ్ బొక్క బోర్లా పడింది. సారా (41), ఒర్లా (36) ఇద్దరు మాత్రమే భారత బౌలర్ల ముందు నిలిచారు. ఇక లె పాల్ (15), లారా డెలానీ (10) ఇద్దరూ రెండంకెల స్కోరు చేశారు. మొత్తమ్మీద 31.4 ఓవర్లలో 131 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. 304 పరుగుల తేడాతో ఘోర పరాజయం మూటగట్టుకున్నారు.

టీమ్ ఇండియా బౌలింగులో టిటాస్ సాధు 1, దీప్తీ శర్మ 3, తనుజా 2, సయాలి 1, మిన్ను మణి 1 వికెట్ పడగొట్టారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com