34.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

చెన్నై సూపర్ విక్టరీ.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం

వరుస గెలుపులతో జోష్ మీదున్న లక్నో సూపర్ జేయింట్స్.. వరుస ఓటములతో దెబ్బతిన్న చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఇంట్రెస్టింగ్‌ మ్యాచ్‌లో ధోని సేన సూపర్ విక్టరీ సాధించింది. ఏకంగా 5 వికెట్ల తేడాతో లక్నోపై విక్టరీ సాధించింది. ఈ గెలుపు కేవలం వరుస ఓటములకు బ్రేక్ వేయడమే కాదు.. CSK ప్లే ఆఫ్ రేసులో నిలిచేందుకు అవకాశాన్ని కూడా ఇచ్చింది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ధోని.. లక్నోకు ఆదిలోనే షాక్ ఇచ్చింది. 23 పరుగులకే 2 కీలక వికెట్లు తీసింది. ప్రతి మ్యాచ్‌లో లక్నో గెలుపులో కీరోల్ ప్లే చేస్తున్న పూరన్‌ను కేవలం 8 పరుగులకే ఔట్ చేయడం మ్యాచ్‌ను టర్న్‌ చేసింది. అయితే ఆ తర్వాత మార్ష్, పంత్‌ మాత్రం కట్టుదిట్టంగా బ్యాటింగ్‌ చేసి.. ఇన్నింగ్స్‌ను కంటిన్యూ చేశారు. పంత్ 63 పరుగులు చేసి.. ఈ సీజన్‌లో తొలి హాఫ్‌ సెంచరీని నమోదు చేశాడు. ఇక ఆయుష్ బదోని 22, అబ్దుల్ సమద్ 20 పరుగులు చేయడంతో 166 పరుగులు చేసింది లక్నో.

167 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన CSK 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను పూర్తి చేసింది. నిజానికి ఈ మ్యాచ్‌ కూడా చేజారినట్టే కనిపించింది. రషీద్, రవీంద్ర మంచి స్టార్టింగే ఇచ్చినా.. రాహుల్ త్రిపాఠి, జడేజా వెంటనే వెనుదిరిగారు. కానీ శివం దూబే CSKను ఆదుకున్నాడు. ఇక ధోని కూడా అద్భుతమైన బ్యాటింగ్‌తో విజయాన్ని అందించాడనే చెప్పాలి. ధోని 11 బంతుల్లో 26 పరుగులు.. శివం దూబే 43 పరుగులతో విజయాన్ని CSKను గెలిపించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com