29.2 C
Hyderabad
Wednesday, September 16, 2026

Live Video

spot_img

చైనా మాస్టర్ స్ట్రోక్.. ట్రంప్‌కు షాక్

అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ పీక్స్‌కు చేరింది. అమెరికాపై 145 శాతం టారిఫ్‌లు విధించి.. ఆర్థికంగా చైనాను దెబ్బకొట్టాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్కెచ్ బ్యాక్ ఫైర్ అయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు చైనా అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తన అమ్ముల పొదిలో ఉన్న అత్యంత కీలకమైన ఆయుధాన్ని అమెరికాపై ప్రయోగించింది. ఈ నిర్ణయంతో ఇప్పుడు ట్రేడ్ వార్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది.

వెస్ట్రన్ కంట్రీస్‌లో ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఏరోస్పేస్, సెమీకండక్టర్ల కంపెనీలకు కావాల్సిన ముడి పదార్థాలు చైనా నుంచే ఎగుమతి అవుతాయి. ఇప్పుడు వీటన్నింటిని నిలిపివేసింది చైనా. ముఖ్యంగా అన్ని సెక్టార్లకు కావాల్సిన అయస్కాంతాల ఎగుమతిని నిలిపివేసింది. అయితే ఈ నిలిపివేత ఎప్పటి వరకు అనేది క్లారిటీ లేదు. ప్రస్తుతం ఎక్స్‌పోర్ట్స్‌కు సంబంధించి కొన్ని నిబంధనలను రూపొందిస్తోంది చైనా. ఇందులో అమెరికాను టార్గెట్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే నిజమైతే కొన్ని కంపెనీలకు శాశ్వతంగా అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలు, అయస్కాంతాల సరఫరా నిలిచిపోనుంది.

నిజానికి చైనా మొదట్లో ఓ నిర్ణయం తీసుకుంది. టారిఫ్ వార్ ప్రారంభమై సమయానికి అప్పటికే రవాణాలో ఉన్న కార్గో నుంచి టారిఫ్‌లను మినహాయించింది. కానీ ఇప్పుడా నిర్ణయంపై కూడా సమీక్ష చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న అరుదైన ఖనిజాలు 90 శాతం చైనా నుంచే వెళుతుంటాయి. ఇదే తమ బలమని చైనాకు తెలుసు. అందుకే ఇప్పుడు ఈ అరుదైన ఖనిజాల ఎగుమతిని మొత్తానికే నిలిపివేసింది. ఇదే విధానం కొనసాగితే అమెరికాతో పాటు.. ఇతర పశ్చిమ దేశాలకు ఇబ్బందులు తప్పవు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com