ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితం ముంబై బయలుదేరి వెళ్లారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు ముంబై వెళ్లారు.
ముంబైలోని ఆజాద్ గ్రౌండ్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడోసారి ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ సహా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నేతలు హాజరు కానున్నారు.
ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత చంద్రబాబు ముంబై నుంచి తిరుగు పయనంలో విశాఖ చేరుకుంటారు.రాత్రికి విశాఖలోనే బస చేయనునున్న ముఖ్యమంత్రి.. రేపు జరగబోయే డీప్ టెక్నాలజీస్ సమ్మిట్-2024కు హాజరు అవుతారు. సదస్సు తర్వాత విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు.