ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న భూ వివాదాల పరిష్కారం కోసం ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. గ్రామ స్థాయిలో భూ తగాదాలు, రీ సర్వేల అవకతవకలకు పరిష్కారాలు ఈ సదస్సులో చూపించడం జరుగుతుందన్నారు. ఈ రెవెన్యూ సదస్సుల్లో ఎమ్మార్వోతో పాటు.. ఆర్‌ఐ, వీఆర్‌ఓ, మండల సర్వేయర్, రెవెన్యూ అదికారులు పాల్గొంటారని చెప్పారు. ప్రతి మండలానికి డిప్యూటీ కలెక్టర్ పర్యవేక్షణాధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు.
- Advertisement with us -