24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్

గౌతమ్ అదాని, మణిపూర్ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం టీపీసీసీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఈ ప్రదర్శనలో సీయం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్ల భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంఛార్జ్ దీపా దాస్ మున్షి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొననున్నారు. పెద్దయెత్తున జనసమీకరణతో కాంగ్రెస్ నేతలందరూ నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకూ భారీ ప్రదర్శన చేయనున్నారు. అమెరికా లో గౌతమ్ ఆధాని పై వచ్చిన ఆర్థిక అవకతవకలు దేశ వ్యాపార, ఆర్థిక రంగాలలో పరువును దెబ్బతీసాయని, అలాగే మణిపూర్ లో వరసగా జరిగిన అల్లర్లు, విద్వంసాలపై మోడీ ఇప్పటి వరకు అక్కడకు వెల్లకపోవడంలాంటి అంశాలపై   ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నాడు చలో రాజ్ భవన్  కార్యక్రమాన్ని టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com