36.2 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

రైతాంగానికి కేంద్రం నూతన సంవత్సర కానుక

ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం ఈ రోజు(2025 సంవత్సరంలో తొలిసారి) సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులకు తీపి కబురు అందించింది. డీఏపీ ఎరువుపై రైతులకు ఇచ్చే సబ్సిడీని మరింత పెంచాలని నిర్ణయించింది. ఇందుకోసం అయ్యే అదనపు భారాన్ని కేంద్రమే భరించనుంది. ఇకపై ఒక 50 కిలోల డీఏపీ బస్తా రూ.1350 కే లభ్యం కానుంది. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది రైతులకు లబ్ధి చూకూరనుంది.

అదేవిధంగా ‘ఫండ్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీ’కి కేంద్రం రూ.800 కోట్ల నిధిని ఏర్పాటు చేసింది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకం కింద అందించే మొత్తాన్ని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ముఖ్యమైన ప్రాజెక్టులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు ఓ ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు చేయాలని కూడా సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com