36.2 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

ఇంక జగన్ రాడని పెట్టుబడిదారులకు చెపుతున్నాం – చంద్రబాబు

భవిష్యత్తులో ఇంక ఎప్పుడూ జగన్ అధికారంలోకి రాడని పెట్టుబడి దారులకు చెపుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. నూతన సంవత్సరాది సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో తనను కలసిన విలేకరులతో చంద్రబాబు ఇష్టాగోష్టి నిర్వహించారు. నాకో బ్రండు ఉందని పెట్టుబడిదారుల్లో నమ్మకం పెంచుతున్నామని, ఈ 6 నెలల్ల 4 లక్షల కోట్లు పెట్టుడులు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. 2024వ సంవత్సరం ఒక చారిత్రక సంవత్సరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్ళలో ప్రజలందరూ భయం, భయంగా ఉండేవారని గడచిన ఆరు నెలల్లో ప్రజల్లో ఒక నమ్మకం వచ్చిందని సీయం వ్యాఖ్యానించారు. గత పరిపాలనలో వ్యవస్ధలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. తాను జగన్ లా కక్షపూరితంగా వ్యవహరించడం లేదని… ఒక వేళ అలానే వ్యవహరించి ఉంటే నేను సీయం అయిన వెంటనే జగన్ని జైల్లో పెట్టేవాళ్ళమన్నారు. మా వాళ్ళు ప్రతి ఒక్కరి అకౌంట్ సెటిల్ చెయ్యాలన్నట్లు ఉన్నారని అయితే అవతలవాళ్ళు చేసిన తప్పులు చేయడానికి నేను సిద్దంగా లేనని చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే తప్పు చేసినవాళ్ళని ఎవ్వరినీ వదిలిపెట్టనని వన్ బై వన్ అందరికీ పనిష్మెంట్ ఇస్తామన్నారు. వచ్చే రెండేళ్లవి కూడా 15వ ఆర్థిక సంఘం నిధులు వాడేశారని అందువల్ల ఎఫ్ఆర్బీఎమ్ అప్పులకు అవకాశం లేదని ఢిల్లీ వెళ్ళి నిధులు తెస్తున్ననని చెప్పారు. తమ ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నామని ప్రభఉత్వం పట్ల ప్రజల్లో పాజిటివ్ నెస్ వచ్చిందన్నారు. వెసులు బాటును బట్టి పధకాలు అమలు చేస్తామన్నారు. మా పార్టీ అధ్యక్షుడితో పాటు, కేంద్ర మంత్రిని, రాష్ట్ర డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా బీసీలను చేశామని బాబు చెప్పారు. గతంలో నేను సీయంగా ఉన్నప్పడే ఎస్సీ అయిన కాకి మాధవరావుని సీఎస్ గా చేశానని తెలిపారు. పార్టీ పెట్టాక ఎప్పుడూ లేనంతగా ఈ సారి టీడీపీ సభ్యత్వం 94 లక్షలకు చేరుకుందన్నారు. వైఎస్సార్సీపీ నేతలు ఏవో పనులు పెట్టుకునే మా దగ్గర చేరడానికి వస్తున్నారని ఈ విషయంపై కూటమి భాగస్వామ్య పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు. 2004లో నాకు నేనుగా ఓడిపోయానని ఈ సారి ఓన్ మెకానిజంతో ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com