34.2 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

టిటిడి తొక్కిసలాట ఘటనపై ప్రముఖుల దిగ్భ్రాంతి

తొక్కిసలాటలో ఘటనపై మాజీ సీఎం వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. తక్షణం అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు కోలుకోవాలని ఆకాంక్షించారు.

తిరుపతి తోపులాటలో నలుగురు భక్తుల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్న ముఖ్యమంత్రి ,గాయాల పాలైన వారికి అందుతున్న చికిత్స పై అధికారులతో మాట్లాడిన సిఎం చంద్రబాబు, టిటిడి అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ  పరిస్థితిని సిఎం తెలుసుకుంటున్నారు.

వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో సమయంలో జరిగిన తొక్కిస లాటలో  ఆరుగురు మృతి చెందారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానని ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.. భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాఖకు సూచించారు.

తిరుపతి ఘటనపై టిటిడి ఛైర్మన్ బి.ఆర్ నాయుడు విచారం వ్యక్తం చేశారు..సంయమనం పాటించాలని విజ్ఞప్తిచేశారు.

తిరుపతి విష్ణు నివాసం టిక్కెట్ కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో 6 గురు భక్తులు చనిపోవడం అత్యంత విషాదకరం వైయస్ షర్మిల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

వైకుంఠ ఏకాదశి టికెట్ల కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందిన ఘటన దిగ్భ్రాంతికరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.

ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీ నారా లోకేశ్, టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుతో పాటుగా పాలకమండలి సభ్యుడు శ్రీ భాను ప్రకాశ్ రెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారాయన.

టికెట్ల కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందిన ఘటన దిగ్భ్రాంతికరమని ఎపి బిజెపి అధ్యకురాలు పుంరందేశ్వరి అన్నారు, కతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com