29.7 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

విజయ్‌ దేవరకొండపై కేసు నమోదు

అట్రాసిటీ కేసు పెట్టాలని ఫిర్యాదు

ఒక సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో చేసిన ప్రసంగం హీరో విజయ్‌ దేవరకొండపై పోలీస్‌ కేసు అయ్యేలా చేసింది. గత నెల 26వ తేదీన ప్రముఖ హీరో సూర్య నటించిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌ లో జరిగింది. ఈ ఈవెంట్‌కి అతిధిగా హాజరైన విజయ్‌ దేవరకొండ అంతకు రెండు రోజుల ముందు ఏప్రిల్‌ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్‌ లోని పహల్గామ్‌ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవే వ్యాఖ్యలు విదాస్పదమై తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఓ వర్గం పోలీస్‌ కేసు పెట్టింది. ఈ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో విజయ్‌ మాట్లాడుతూ ఐదు వందల ఏళ్ల క్రితం ట్రైబల్స్‌ కొట్టుకున్నట్లు పాకిస్తా్‌న్‌ వాళ్ళు బుద్ధి లేకుండా చేసే పనులు ఇవి అంటూ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆరోజు ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ లో విజయ్‌ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు గిరిజనులను అవమానించినట్లు ఉన్నాయని అందువల్ల అతనిపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఆర్‌.నగర్‌ పీఎస్‌లో కేసు నమోదయ్యింది. ట్రైబరల్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కిషన్‌ రాజ్‌ చౌహాన్‌ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. షెడ్యూల్‌ ట్రైబ్స్‌ కమ్యూనిటీ గురించి ఓ పబ్లిక్‌ ఫ్లాట్‌ పారమ్‌ పై ఈ విధంగా అవమానకరంగా మాట్లాడం బాధ కలిగించిందని, ఆయన వ్యాఖ్యలను అన్ని టీవీలు, యూట్యూబ్‌ ఛానల్స్‌ కూడా ప్రచారం చేశాయని కిషన్‌ రాజ్‌ తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన జాతిపై అవమానకరంగా మాట్లాడిన విజయ్‌ దేవరకొండపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కిషన్‌ రాజ్‌ చౌహాన్‌ తన ఫిర్యాదులో పోలీసులను కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com