37.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

టాలీవుడ్‌ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం

తెలుగు సినిమా పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించేందుకు, టాలీవుడ్‌లో లోటుపాట్లు సరిదిద్దేందు మంత్రివర్గం ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సినీ పరిశ్రమ కూడా ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. ప్రభుత్వానికి, సినిమా పరిశ్రమకు మధ్యవర్తిగా ఉండటానికే దిల్‌రాజను ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించామని రేవంత్‌రెడ్డి చెప్పారు. సినీ పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను అన్నింటినీ అధ్యయనం చేస్తామన్నారు. అనుమానాలు, అపోహలు, ఆలోచనలను కూడా సర్కారుతో పంచుకున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన యేడాది కాలంలో ఎనిమిది సినిమాలకు స్పెషల్ జీవోలు ఇచ్చామన్నారు. పుష్ప-2 సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సక్సెస్‌ కోసం పోలీస్ గ్రౌండ్ కూడా ఇచ్చామన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నామన్నారు. టాలీవుడ్‌ బాగుండాలని కోరుకున్నామని చెప్పారు. తమ ప్రభుత్వానికి ఐటీ, ఫార్మాతో పాటు సినిమా పరిశ్రమ కూడా ముఖ్యమే అని స్పష్టం చేశారు. తెలంగాణలో సినిమా రంగంలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసే గద్దర్ అవార్డును ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో ఎక్కడైనా ఘాటింగ్ చేసుకుని హైదరాబాద్‌కు రెండు గంటల్లో వచ్చే వెసులుబాటు ఉందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
తెలంగాణలోని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయాలని టాలీవుడ్‌ ప్రముఖులకు సూచించారు. ముంబయిలో వాతావరణం కారణంగా బాలీవుడ్ అక్కడ స్థిరపడిందన్న రేవంత్‌ రెడ్డి.. కాస్మోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ బెస్ట్ సిటీగా స్థానం సంపాదించుకుందన్నారు. అందుకే హాలివుడ్,బాలీవుడ్ కూడా హైదరాబాద్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో పెద్ద సదస్సు ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమను నెక్ట్ప్ లెవల్‌కు తీసుకెళ్లడమే తమ ప్రభుత్వం ఉద్దేశ్యమన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరుస్తున్నామన్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి నైపుణ్యాలను పెంచి ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశం ఒలింపిక్స్‌లో పతకాలు తెచ్చుకోలేకపోతుందని రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో త్వరలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. గంజాయి, డ్రగ్స్‌తో పాటు సామాజిక అంశాలపైన సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సినిమా పరిశ్రమకు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామని టాలీవుడ్‌ నిర్మాతలు, దర్శకులు, నటులకు హామీ ఇచ్చారు. సినిమా పరిశ్రమను ప్రోత్సాహించడమే తమ ముఖ్య ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన భాద్యత తనపై ఉందన్న రేవంత్‌రెడ్డి.. తనకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవని స్పష్టంచేశారు. తెలుగు పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అంతా కలిసి అభివృద్ధి చేద్దామని ప్రతిపాదించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఎప్పుడూ అండగానే ఉంటుందని మరీ మరీ భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com