దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. రామయ్య కల్యాణం ప్రతీ చోటా నిర్వహించినా, భద్రాచలంలో జరిగే వేడుక విశేషమే. 16వ శతాబ్దంలో భక్తురాలు పోకల దమ్మక్క స్వామివారికి తాటాకు పందిరి వేస్తూ పూజలు ప్రారంభించింది. అనంతరం కంచర్ల గోపన్న 1674లో ఈ ఆలయాన్ని నిర్మించాడు.
స్వామివారి దర్శన వేళలు :
-
తెల్లవారుజామున 4.30 గంటలకు సుప్రభాత సేవ – టికెట్ ధర: రూ.200
-
ఉదయం 5.30 నుంచి 7.00 గంటల వరకు బాలభోగం నివేదన
-
ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు సహస్ర నామార్చన (దంపతులకు ప్రవేశం) – టికెట్ ధర: రూ.200
-
మధ్యాహ్నం 1.00 నుంచి 3.00 గంటల వరకు ఆలయం మూసి ఉంచుతారు
-
మధ్యాహ్నం 3.00 నుంచి రాత్రి 9.30 వరకు భక్తులకు దర్శనం
-
రాత్రి 7.00 గంటలకు దర్బారు సేవ – ప్రత్యేక దర్శనం టికెట్ ధర: రూ.100
-
టికెట్ లేని భక్తులకు పడమర మెట్ల ద్వారా రాజగోపురం గుండా మూలవిరాట్టు దర్శనం
-
స్థానికులకు మంగళ, బుధ, గురువారాల్లో సాయంత్రం 4.00 నుండి 5.00 వరకు గుర్తింపు కార్డుతో ఉచిత దర్శనం (రూ.100 టికెట్ మార్గం)
-
పర్ణశాల సందర్శనకు వృద్ధులు, చిన్న పిల్లల తల్లులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం
-
భద్రాచలం చేరేందుకు TSRTC బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి.
-
ప్రముఖుల ప్రోటోకాల్ దర్శనాల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు.
-
శ్రీరామనవమి పూజల వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి (https://bhadradritemple.telangana.gov.in). సేవా టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.
విశేష సేవలు :
-
రూ.100 టికెట్‌పై ప్రతి ఆదివారం 7.00 నుండి 8.00 వరకు మూలవరుల అభిషేకంలో పాల్గొనవచ్చు (రామనవమి మినహా).
మంగళవారం ఉదయం 8.30 గంటలకు ఆంజనేయ స్వామి అభిషేకం, శుక్రవారం లక్ష్మీ తాయారు అమ్మవారి అభిషేకం, శనివారం శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి అభిషేకం – ప్రతి సేవకు రూ.100 టికెట్.
-
రూ.15,000 చెల్లించి ఏడాదిలో సీతారాముల కల్యాణంలో పాల్గొనవచ్చు (శ్రీరామనవమి మినహా).
-
రూ.3 లక్షలు చెల్లించి వస్త్రాలంకరణ సేవలో పాల్గొనవచ్చు.
-
రూ.15,000 చెల్లించి ప్రతి పుష్యమి నక్షత్రం రోజున శాశ్వత పట్టాభిషేకం చేయించవచ్చు.
-
రూ.1,116 చెల్లించి అన్నదానం, రూ.5,116 చెల్లించి ప్రసాద వితరణ.
వసతి సౌకర్యాలు :
-
నాన్-ఏసీ రూములు: రూ.448 – రూ.896
-
ఏసీ రూములు: రూ.1,456
-
కాటేజీలు: రూ.2,240
-
ఇవి ఆన్లైన్ లేదా నేరుగా బుక్ చేసుకోవచ్చు.