32.2 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

బదాస్ నెరజాన కీర్తి కుల్హారి

కీర్తి కుల్హారి నటి, నిర్మాతగా బాలీవుడ్ లో సుపరిచితం. కిచ్డీ(khichdi) సినిమాతో బాలీవుడ్ లోకి 2010లో ఎంటర్ ఇచ్చిన కీర్తి… వివిధ సినిమాలు, సీరియళ్లతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా కీర్తి నటించిన బాదాస్ రవికుమార్(Badass Ravikumar) సినిమా విడుదలైంది. సినిమా ప్రమోషన్ కోసం సోషల్ మీడియాలో కీర్తి హంగామా చేస్తోంది.

1985లో ముంబైలో జన్మించిన కీర్తి పూర్వికులది రాజస్థాన్ లోని ఝుంఝును. తండ్రి నావికాదళ అధికారి కావడంతో దేశంలోని వివిధ సంస్కృతులు, ముఖ్యప్రాంతాలన్నింటితో పరిచయం ఉంది.2016లో వచ్చిన పింక్(pink) సినిమాలో నటనలో తన విశ్వరూపాన్ని చూపెట్టింది కీర్తి కుల్హరి. అమ్మాయిగా అణుకువగా ఉండటం కన్నా…ధైర్యవంతురాలిగా ఉండే పాత్రలే చేయటం కాకతాళియం.కీర్తి అమ్మాయిగా కన్నా అబ్బాయిల మాదిరి కనిపించేందుకే ఇష్టపడుతుంది. పోని టెయిల్, బాబ్డీ హెయిర్ తో ఉండటం ఇష్టపడుతుంది.తరచుగా ఇదే హేయిర్ స్టైల్ తో ఉండటం కీర్తికి ఇబ్బందులు కూడా తెచ్చిపెట్టింది. అమ్మడు లెస్బియన్ అని పుకార్లు షికారు చేశాయి. కవర్ చేసేందుకు నానా తిప్పలు పడింది.20219లో మిషన్ మంగళ్, ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ సినిమాలతో దేశ వ్యాప్తంగా పాపులారిటీ వచ్చింది. జీలో వచ్చిన హిసాబ్ బరాబర్ లో అవినీతిని వెలికితీసే రైల్వే టికెట్ కలెక్టర్ గా మైమరిపించింది.ఆరడుగుల నెరజాన కీర్తి హొయలు అంతా ఇంత కాదు. నలుగురు అమ్మాయిల కథగా అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఫోర్ మోర్ షార్ట్స్ ప్లీజ్ లో లీడ్ రోల్ చేసింది. 2019 నుంచి ఇప్పటి వరకు నాలుగు దఫాలుగా వస్తున్న ఫోర్ మోర్ షార్ట్స్ ప్లీజ్ సీరీస్ లో కీర్తి రొమాన్స్ అంతా ఇంత కాదు.నటుడు షాహీ సెహగల్ ను 2016లో వివాహం చేసుకున్న కీర్తి 2021లో విడిపోయింది. అయితే ఫోర్ మోర్ షార్ట్స్ ప్లీజ్ సీరీస్ లో రొమాన్స్  సీన్ పాత్రకు తటపటాయిస్తుంటే క్యారెక్టర్ లో ఒదిగిపోవాలని తన మాజీ భర్త ఇచ్చిన సలహాతోనే చేశానని చెప్పుకుంది.

 

courtesy: instagram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com