ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే టీమిండియా దుబాయ్‌కి చేరుకుంది. నెట్స్‌లో చెమటోడుస్తుంది. అయితే బీసీసీఐ కండిషన్స్ ప్రకారం ఫ్యామిలీస్‌ను తీసుకెళ్లకుండాకే ఫ్లైట్ ఎక్కేశారు. అయితే ఇప్పుడు టీమిండియా ప్లేయర్స్‌కు ఓ గుడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ. వారి ఫ్యామిలీస్ దుబాయ్ వెళ్లేందుకు అంగీకరించింది. కానీ ఒక కండిషన్ పెట్టింది.
అయితే ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం వారు ఉండేందుకు అనుమతి లేదని చెప్పింది బీసీసీఐ. కేవలం ఒక మ్యాచ్ కోసం మాత్రమే వారిని వెంట తీసుకెళ్లేందుకు అంగీకరించింది బీసీసీఐ. ఈ విషయంలో ప్లేయర్స్ చర్చించుకొని బీసీసీఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దానికి తగ్గట్టుగా బీసీసీఐ ఏర్పాట్లు చేస్తుంది.
నిజానికి బీసీసీఐ రూల్స్ ప్రకారం కనీసం 45 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు విదేశాలకు వెళ్తేనే ఫ్యామిలీస్‌ను వెంట తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అది కూడా రెండు వారాలు మాత్రమే. ఛాంపియన్స్ ట్రోపీ నెల రోజుల్లోనే ముగిస్తుంది కాబట్టి ఈసారి ఫ్యామిలీస్‌కు అనుమతించలేదు. అదే సమయంలో వ్యక్తిగత సహాయ సిబ్బందికి అనుమతించలేదు.
ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో, ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో టీమ్ ఇండియా తలపడనుంది.