31.2 C
Hyderabad
Tuesday, September 15, 2026

Live Video

spot_img

స్టార్ ఫిష్ ఖుషాలీ కుమార్

ఖుషాలి కుమార్ బాలీవుడ్ లో ప్రముఖ కుటుంబం నుంచి వచ్చిన హీరోయిన్. ప్రముఖ నిర్మాత, టీ సీరిస్ అధినేత గుల్షన్ కుమార్ గారాల పట్టి ఖుషాలి. స్వతహాగా ఫ్యాషన్ డిజైనర్ కావటంతో…సోషల్ మీడియాలో వేడిక్కించే ఫోటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.పంజాబీ కుటుంబానికి చెందిన ఖుషాలీ 1988లో జన్మించింది. ఢిల్లీ NIFTలో ఫ్యాషన్ డిజైన్ కోర్సు చేసింది.అందాల ఖుషాలీ సినీ రంగంలోకి అడుగుపెట్టే ముందు తన పేరులో ఐ అక్షరాన్ని(khushalii) అదనంగా చేర్చింది.తండ్రి గుల్షన్ కుమార్ కు నివాళిగా సోదరి తులసి కుమార్ పాడిన పాటతో మ్యూజిక్ అల్బమ్ ద్వారా చిత్ర పరిశ్రమలోకి అరంగేట్రం చేసింది2022లో ధోఖా రౌండ్ ది కార్నర్ చిత్రంతో సినీ రంగంలోరి అడుగుపెట్టింది. మాధవన్ తో జతకట్టిన ఈ సినిమాకు గాను 23వ ఐఫా అవార్డుల వేడుకలో స్టార్ డెబ్యూ ఆఫ్ ది ఇయర్-ఫిమేల్ అవార్డు గెలుచుకుంది.2023లో వచ్చిన స్టార్ ఫిష్ చిత్రంలో ప్రధాన పాత్రలో కనువిందు చేసిన ఖుషాలీ ఈ సినిమా షూటింగ్  ను సవాలుగా తీసుకుని నటించింది. తన అద్భుతమైన స్టైలింగ్ గేమ్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.2024లో జియోసినిమాలో విడుదలైన పుల్కిత్ చిత్రం దేడ్ బిఘా జమీన్ సినిమాలో ఈ అందాల భామ ప్రధాన పాత్రలో కనిపించింది.2024లో ఘుడ్చాడి సినిమాలో పార్థ్ సమతాన్‌తో ఖుషాలీ నటించింది. ఈ సినిమాలో సంజయ్ దత్, రవీనా టాండన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.ఫ్యాషన్ డిజైనర్ గా గుర్తింపుపొందిన ఈ అమ్మడు రేవ్ పేరుతో తన బ్రాండ్ మార్కెట్లో విడుదల చేసింది. రేవ్ బ్రాండ్ కు సినీ రంగంలో మంచి డిమాండ్ ఉంది. అందాల ఖుషాలీ ఈ ఏడాది మూడు సినిమాల్లో చేస్తోంది. హైడ్(Hide), క్రాస్ ఫైర్(cross fire), దిల్ కతియా(Dil katiya) సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.

courtesy : instagram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com