ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రజా ప్రభుత్వం ప్రకటించింది. కొత్త రేషన్ కార్డు నమూనాను సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఈ రోజు జరిగిన సమావేశంలో సీఎం… ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. లేత నీలి రంగులో కొత్త రేషన్ కార్డు తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. రేషన్ కార్డుపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ఉండే విధంగా రేషన్ కార్డు నమూనాని ఖరారు చేశారు.
ఇక రేషన్ కార్డుపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న వారికి కూడా కొత్త కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 80 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
రేషన్ కార్డుల రంగు మారింది
- Advertisement with us -