బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే. అలనాటి హీరో చుంకీపాండే గారాల పట్టి సినిమాలే లక్ష్యంగా చిన్ననాటి నుంచి మెలుకువలు నేర్చుకుంది. అనన్య సినిమాలతో బిజీగా ఉన్నా… ఫ్యాషన్ షోలు, సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు షేర్ చేసి అభిమానుల్ని అలరిస్తుంది.పంజాబీ కుటుంబానికి చెందిన అనన్య పాండే 1998లో ముంబైలో జన్మించింది
తండ్రి చుంకీ పాండే ప్రముఖ హీరో..తల్లి భావనా పాండే కాస్ట్యూమ్ డిజైనర్. దీంతో ఈ బ్యూటీకి కెరీర్ నల్లేరుమీద నడకగా మారింది
ధీరూబాయి అంబానీ పాఠశాలలో విద్యాబ్యాసం కొనసాగించింది
సినిమాల్లోకి రాకముందే 2017లోనే పారీస్ ఫ్యాషన్ షోలో పాల్గొని సత్తా చాటింది జిరాఫీ కాళ్ల సుందరి
కరణ్ జోహర్ సమర్పణలో 2019లో స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 సినిమాతో వెండితెరకు పరిచయమైంది
భూమి పడ్నేకర్, కార్తిక ఆర్యన్ లతో కలిసి 2019లోనే పతి పత్నీ ఔర్ వో సినిమా చేసింది
పాన్ ఇండియా సినిమా లైగర్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది
22 ఏళ్లకే రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ వరుసగా సినిమాలు చేస్తోందికేసరి సీక్వెల్ కేసరి చాప్టర్ 2 సినిమా విడుదల కాగా చాంద్ మేరే దిల్ సినిమా నిర్మాణంలో ఉంది
courtesy : instagram