చంద్రుడి ఉపరితలం ఎలా ఉంటుంది? దీనికి జవాబుగా ఇప్పటి వరకు అనేక వీడియోలు వచ్చాయి. కానీ ఇప్పుడో వీడియోను రిలీజ్ చేసింది ఫ్లైర్ ప్లై ఏరో స్పేస్ సంస్థ. ఈ వీడియో చూస్తే చంద్రుడిపై ఉపరితలం ఎలా ఉంటుంది? అనే ప్రశ్నకు క్లియర్ కట్ సమాధానం దొరుకుతుంది. ఫైర్ ఫ్లై ఏరో స్పేస్ సంస్థ ఇప్పటికే చంద్రుడిపైకి ఒక లూనార్ ల్యాండర్‌ను ప్రయోగించింది. భూమి నుంచి అంతరిక్షంలోకి చేరింది మొదలు.. ఇది తన పనిని ప్రారంభించేసింది. బ్లూ ఘోస్ట్ ఇప్పటికే భూ కక్ష్యను దాటి చంద్రుడి కక్ష్యలోకి చేరింది. దీంతో ఇప్పుడు జాబిల్లికి సంబంధించిన హైరిజల్యూషన్ వీడియోలను పంపుతోంది ఈ ల్యాండర్.
ప్రస్తుతం చంద్రుడికి 100 కిలోమీటర్ల ఎత్తులో చక్కర్లు కొడుతోంది బ్లూ ఘోస్ట్ ల్యాండర్ లెటెస్ట్‌గా పంపిన వీడియోను చూస్తే… చంద్రుడిపై ఉన్న వాతావరణం, పరిస్థితులను క్లియర్ కట్‌గా కనిపిస్తోంది. ఈ ఏడాది జనవరి 15న స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ఈ ల్యాండర్‌ను నింగిలోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత భూకక్ష్యలో చక్కర్లు కొడుతూ ఫిబ్రవరి 13న చంద్రుడి కక్ష్యలోకి చేరింది. ఇక అప్పటి నుంచి చంద్రుడి చుట్టూ చక్కర్లు కొడుతోంది. ఇక చంద్రుడిపై మేర్ క్రిసూమ్ అనే ఏరియాలో ల్యాండ్ కానుంది ఈ ల్యాండర్. మార్చి 2న చంద్రుడిపై ల్యాండ్ కానుంది ఈ రోవర్.
చంద్రుడి ఉపరితలంపైకి 10 సైంటిఫిక్ పేలోడ్స్‌ను చేర్చడం టార్గెట్‌గా పెట్టుకుంది నాసా. కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీస్ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రయోగం చేపట్టారు. నాసా ఫ్యూచర్లో చేపట్టబోయే హ్యూమన్ మిషన్స్‌కు కావాల్సిన డేటాను సేకరించేందుకు ఈ ప్రయోగాలు చేస్తున్నారు. ఇక భూమిపై నుంచి సైంటిస్టులకు కనిపించని చంద్రుడి ప్రాంతాలను అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగాలు బాగా ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నారు.
బ్లూ ఘోస్ట్‌తో పాటు.. అతినా, జపాన్‌కు చెందిన ఐస్పేస్ హకూటో-R2 మిషన్ కూడా ప్రస్తుతం చంద్రుడిపై ల్యాండ్ కానున్నాయి. సోలార్ విండ్.. భూమి మ్యాగ్నటిక్ ఫిల్డ్కు సంబంధించిన రీసెర్చ్ చేయనున్నాయి ఈ ల్యాండర్లు.