35.2 C
Hyderabad
Friday, May 22, 2026

Live Video

spot_img
Home Blog Page 225

మాఘ పౌర్ణిమ స్నానాలకోసం ఇలా వెళ్లాలి…

  • తొక్కిసలాటల నివారణకు కొత్త ప్లాన్
  • 5 లక్షల వాహనాలు ఒకేసారి పార్కింగ్‌ చేసేలా ఏర్పాట్లు
  • నిబంధనలు కఠినతరం…
  • రోడ్లపై ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక చర్యలు
  • ఉన్నతాధికారులతో యోగీ మీటింగ్‌…

రేపు మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రయాగ్‌రాజ్ లో ట్రాఫిక్ జామ్‌లను నివారించేందుకు మహాకుంభమేళాకు ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు, కొత్త ప్రణాళికను అధికారులు ప్రకటించారు. పవిత్రస్నానాలకు వచ్చే భక్తుల రాకపోకలకు ప్రత్యేక మార్గాన్ని సూచించారు.మహా కుంభమేళాలో వచ్చే ఆరు పవిత్ర ఘడియల్లో ఐదోదైన మాఘపౌర్ణమి చాలా చాలా విశిష్టమైనది. ఈ పుణ్య ఘడియల్లో స్నానం చేసి, తర్పణాలు వదిలేందుకు ప్రపంచం నలుమూలలనుంచి భక్తులు వస్తున్న నేపధ్యంలో కొన్ని ప్రత్యేక నిబంధనలు అమల్లోకి తెస్తున్నారు. ఈ ఆంక్షలు ఇవాల్టి నుంచే అమల్లోకి రానున్నాయి. ఉదయం నాల్గింటినుంచే కుంభమేళా పరిసరాల్లో నో వెహికల్ జోన్ నిబంధన అమల్లోకి వచ్చింది. చాలా ప్రాంతాన్ని ఈ పరిధిలోకి తీసుకొచ్చారు. బయటి నుంచి వచ్చే వారికోసం నగరం నలుమూలల పలు పార్కింగ్‌ ఏరియాలను ఏర్పాటు చేశారు. కోట్ల మంది రాకతో తొక్కిసలాటలు జరగకుండా ఉండేందుకు ఈఏర్పాటు చేశారు. భక్తులు నిర్దేశిత రూట్ లో వచ్చి కేటాయించిన చోట వెహికల్ పార్కింగ్ చేసుకుని అక్కడనుంచి నడచి వచ్చి ఘాట్‌ ల దగ్గర పవిత్రస్నానాలు చేయాలి. తమ పనిపూర్తి చేసుకుని మరో రూట్‌ నుంచి తమ పార్కింగ్‌ కు చేరుకుని వెహికల్ తీసుకుని వెళ్లాలి. ఈ నిబంధనలు రేపు పౌర్ణిమ ఘడియలు పూర్తయ్యే వరకూ అమల్లో ఉంటాయి. ఇవి కల్పవసీలు అంటే కుంభమేళాలో కొన్ని రోజులు ఉండాలనుకునే వారికి కూడా వర్తిస్తాయి.
సీఎం యోగీ ఆదిత్య నాధ్ నిన్న ఉన్నతాధికారులతో భేటీ అయి నగరంలో క్రమబద్ధమైన ట్రాఫిక్ నియంత్రణ, క్రౌడ్‌ మేనేజ్ మెంట్‌ పద్ధతులపైనా చర్చించారు. దాదాపు 5 లక్షల వాహనాలు ఒకేసారి పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉందని భక్తులందరూ కఠినమైన ఆదేశాలు పాటిస్తూ నియమబద్ధంగా నడచుకొని పుణ్యస్నానాలు చేసి వెనక్కు మరలాలని యోగీ కోరారు. ఏది ఏమైనా రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌ అవడానికి వీల్లేదని, వాహనాలు క్యూలో నిలబడి ప్రయాణించే దురవస్థ లేకుండా చూడాలని కూడా యోగీ ఆదేశించారు. గతనెల 29న మౌనీ అమావాస్య సందర్భంగా షాహీ స్నాన్ సందర్భంగా తొక్కిసలాటకు 30 మందికి పైగానే మరణించడం వల్ల ఈసారి కఠిన చర్యలు అమలు చేస్తున్నారు.

బారికేడ్లు విరిచేసి…

భక్తులు క్రమపద్ధతిలో బారికేడ్ల ద్వారా స్నానఘట్టాలకు చేరుకునేలా అప్పట్లో ఏర్పాట్లు చేసినా జనం ఎక్కువ రావడంతో బారికేడ్లు విరిచేసి, వాటిపైనుంచి దూకేసి తోసుకు రావడంతో తొక్కిసలాట జరిగిందని ఆ ఘటన వీడియో ఫుటేజ్ లో బయటపడింది.

మౌనీ రాయ్ న్యూ లుక్

బెంగాలి భామ మౌనీ రాయ్ హిందీ సీరియల్ క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ ధారావాహిక ద్వారా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. దేవోంకీ దేవ్, మహదేవ్ లో సతీదేవి పాత్ర, నాగిన్ లోని శివన్యా, శివాంగీ పాత్రలు గుర్తింపు తీసుకొచ్చాయి. సోషల్ మీడియాలో అందాలు ఆరబోసే మౌనీ…సంప్రదాయ చీరకట్టులో న్యూ లుక్ ఆట్టుకుంటోంది.కథక్ నృత్య కళాకారిణి మౌనీ… 2014లో ఝలక్ దిఖలాజా అనే డ్యాన్స్ షోలో ఫైనలిస్ట్ గా నిలిచింది. ఐసీ నఫ్రత్ తో కైసా ఇష్క్ ధారావాహికలో జనూన్ పాత్రలో కూడా నటించింది.పశ్చిమ బెంగాల్లోని కుచ్ బిహార్ లో 1985లో జన్మించిన మౌనీ…పాఠశాల విద్య పూర్తయ్యాక ఢిల్లీలోని ప్రతిష్టాత్మక మిరాండా హౌస్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మాస్ కమ్యూనికేషన్ లో అడ్మీషన్ తీసుకున్నా… దాన్ని మధ్యలోనే వదిలేసి ముంబై చేరుకుంది మౌనీ..

 

బ్రహ్మాస్ర హిందీ సినిమాలో మౌనీ రాయ్ నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు దక్కింది.

మౌని రాయ్‌ తరచు దుబాయ్ వెళుతుండటంతో ఆ దేశ ప్రభుత్వం ఈ అందాల బామకు UAE గోల్డెన్ వీసా  మంజూరు చేసింది. మూడు సంవత్సరాల స్నేహం తర్వాత మలయాళీ వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను 2022లో మౌనీ వివాహం చేసుకుంది.  2025 కొత్త సంవత్సర వేడుకల్లో తప్పతాగిన మౌనీ రాయ్ పబ్లిగ్గా దొరికిపోయింది. ఫొటోలు, వీడియో రికార్డు చేయొద్దని మౌనీ భర్త నంబియార్ మీడియాను వేడుకోవల్సివచ్చింది.2008లో పంజాబీ సినిమా హీరో హిట్లర్ ఇర్ లవ్ తో వెండితెరకు పరిచయం అయింది. 2018లో అక్షయ్ కుమార్ తో కలిసి గోల్డ్ సినిమా ద్వారా బాలీవుడ్ లో అడుగుపెట్టింది.

మౌనీరాయ్ బుల్లితెరపై తన సత్తా చాటినా వెండితెరపై హీరోయిన్ గా ఇంకా నిలదొక్కుకోలేదు. సరైన బ్రేక్ కోసం చూస్తోంది.

courtesy: instagram

విజయ్ దేవరకొండ మూవీకి ఆడిషన్స్

హీరో విజయ్ దేవరకొండ, ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్, డైరెక్టర్ రవికిరణ్ కోలా కాంబినేషన్ భారీ పాన్ ఇండియా మూవీ ఆడిషన్స్ అనౌన్స్ మెంట్

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో మరో క్రేజీ మూవీలో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ చిత్రమిది. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా రూపొందనుంది.

ఈ రోజు ఈ సినిమా నుంచి ఆడిషన్స్ అనౌన్స్ మెంట్ చేశారు. 25-65 ఏళ్ల వయసున్న మేల్, 25-60 ఏళ్ల వయసు గల ఫీమేల్ ఆర్టిస్టులు, నటనలో ఆసక్తి గల 5-14 ఏళ్ల బాయ్స్, 5-12 ఏళ్ల గర్ల్స్ ఈ ఆడిషన్స్ లో పాల్గొనవచ్చు. కాకినాడ హోటల్ శ్రీవత్సలో ఈ నెల 15, రాజమండ్రి హోటల్ సూర్యలో ఈ నెల 17న, భీమవరం హోటల్ గ్రాండ్ లీల కృష్ణలో ఈ నెల 19న ఈ ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. ఔత్సాహిక నటీనటులకు ఇదొక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.

రామ్ మధ్వాని ‘ వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ టీజర్ విడుదల

మార్చి 7 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

జలియన్ వాలాబాగ్ ఉదంతం గురించి అందరికీ తెలిసిందే. అయితే దానికి వెనుకున్న అసలు రహస్యాలు, ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం దురాగాతాల్ని వెలికి తీసేలా ‘ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్’ అనే వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఈ సిరీస్ సోనీ లివ్‌లో మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. జాతీయ అవార్డు గ్రహీత, అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయిన టాలెంటెడ్ డైరెక్టర్ రామ్ మధ్వాని ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు.

జలియన్ వాలాబాగ్ ఊచకోత నేపథ్యానికి వ్యతిరేకంగా పోరాడిన కాంతిలాల్ సాహ్ని అనే న్యాయ వ్యాధి పాత్రలో తరుక్ రైనా నటించారు. హంటర్ కమీషన్ చరిత్రను వక్రీకరిస్తుండటంతో ఈ కాంతిలాల్ జాత్యహంకారం, చెరిపివేసి సత్యం కోసం పోరాడుతుంటాడు. మరి అసలు నిజాల్ని కాంతిలాల్ వెలికి తీశాడా? లేదా? ఈ ప్రయాణంలో స్నేహితులతో, అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా టీజర్‌ను కట్ చేశారు.

రామ్ మధ్వాని మాట్లాడుతూ.. నాకు ఎల్లప్పుడూ వలసవాదం, జాత్యహంకారం, పక్షపాత ధోరణి వల్ల కలిగే సమస్యలను తెలుసుకుంటూ ఉంటాను. సాంస్కృతిక, భాషా, సామాజిక, కళాత్మక వలసరాజ్యాల చుట్టూ ఉన్న ప్రశ్నలు నన్ను చాలాకాలంగా వెంటాడుతూనే ఉన్నాయి. నా తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ ఐడియా తట్టింది. ఇది మన గతానికి సంబంధించింది. బ్రిటీష్ సామ్రాజ్యంలో జరిగిన ఘోర ఉదంతం ఇది. ఇందులోని నిజనిజాల్ని తెలియజేయాలని అనుకున్నాను. అప్పుడే ది వేకింగ్ ఆఫ్ ఏ నేషన్ ఆలోచనకు ప్రాణం పోసినట్టు అయింది. ఇలాంటి ఓ గొప్ప చారిత్రాత్మకమైన ప్రాజెక్ట్‌కు అండగా నిలిచిన సోనీ లివ్ వారికి ధన్యవాదాలు. ఈ కోర్ట్ డ్రామా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.

రామ్ మధ్వాని ఫిలింస్ బ్యానర్‌పై రామ్ మధ్వాని, అమిత మధ్వాని నిర్మించిన ఈ సిరీస్‌లో తారక్ రైనా, నికితా దత్తా, సాహిల్ మెహతా, భావషీల్ సింగ్, అలెక్స్ రీస్, పాల్ మెక్‌ఇవాన్‌లతో వంటి వారు నటించారు. ఈ సిరీస్ కథను శంతను శ్రీవాస్తవ, శత్రుజీత్ నాథ్, రామ్ మధ్వానీ రచించిచారు. మార్చి 7 నుంచి సోనీ లివ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

పిల్లలను ఆలోచనలకు తగ్గట్టుగా ఎదగనివ్వాలి – ప్రధాని నరేంద్ర మోదీ

తమ పిల్లలను మోడల్స్‌గా ప్రదర్శించవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లిదండ్రులకు సూచించారు. పరీక్షా పే చర్చా కార్యక్రమంలో పిల్లలతో ఆయన ముచ్చటించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఇతర పిల్లల్లాగే ఉండేలా చూడాలని, మీ పిల్లలు వారికి అత్యంత ఆసక్తి ఉన్న అంశాల గురించి చదివేలా చేయాలని మోదీ సూచించారు. పిల్లలు తమ ఆసక్తులను కూడా దృష్టిలో ఉంచుకోవాలని, అందరితో బహిరంగంగా మాట్లాడాలని, తల్లిదండ్రులు తమ సమస్యలను పిల్లలపై రుద్ద కూడదని ప్రధానమంత్రి మోదీ అన్నారు. ప్రతి పిల్లలు ఏదో ఒక రంగంలో రాణిస్తారని అన్నారు. మీరు ప్రధానమంత్రి కాకపోతే, మంత్రి అయితే, ఏ శాఖను ఎంచుకుంటారు? అని విద్యార్థులు అడిగిన ప్రశ్నకు మోదీ సమాధానం ఇచ్చారు. “నైపుణ్యాలు చాలా ముఖ్యమైనవి కాబట్టి నేను నైపుణ్యాల విభాగాన్ని ఎంచుకుంటాను అని చెప్పారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల నైపుణ్యాలపై దృష్టి పెట్టాలన్నారు. పిల్లలు అలసిపోతే పరీక్షల్లో బాగా రాయగలరా? అని అన్నారు.మనం రోబోలము కాదు, మనుషులం. పిల్లలను నాలుగు గోడల మధ్య బంధించి పుస్తకాల చెరసాలలో వేస్తే, వారు ఎప్పటికీ ఎదగలేరు అని ప్రధానమంత్రి అన్నారు. వారికి బహిరంగ ఆకాశం కల్పించాలని, స్వేచ్ఛ కూడా అంతే ముఖ్యమని అన్నారు.

ఈ సంవత్సరం ‘పరీక్ష పే చర్చ’ ఢిల్లీలోని సుందర్ నర్సరీలో నిర్వహించారు. పరీక్షల ఒత్తిడి నుండి విద్యార్థులను విముక్తి చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ కార్యక్రమం లక్ష్యం విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, వారి ఒత్తిడి స్థాయిలను తగ్గించడం, వారు ఆరోగ్యంగా ఉండటానికి ప్రేరేపించడమే ప్రధాన ఉద్దేశం. పరీక్షల్లో సమయ వినియోగం ప్రాముఖ్యతను ప్రధానమంత్రి మోదీ నొక్కి చెప్పారు. విద్యార్థులు దీని కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, వారు ఆనందించే అంశాలపై మాత్రమే దృష్టి పెట్టడం కంటే సవాలుతో కూడిన అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలని ఆయన సూచించారు. కేవలం సలహాలే కాకుండా విద్యార్థుల ప్రత్యేక బలాలను గుర్తించి, ప్రోత్సహించాలని ప్రధానమంత్రి విద్యావేత్తలకు సూచించారు. విద్యార్థులు విలువైనవారని, అర్థం చేసుకున్నారని భావించే వాతావరణాన్ని వాలికి కల్పించాలని మోదీ నొక్కి చెప్పారు.
పరీక్షల ప్రాముఖ్యతను వివరిస్తూనే పరీక్షలకు సిద్ధం కావడం కంటే జ్ఞానం పొందడంపై దృష్టి పెట్టాలని ప్రధాని, విద్యార్థులను ప్రోత్సహించారు.

తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. పిల్లలు తమ ఆసక్తులను అన్వేషించడానికి స్వేచ్ఛను అనుమతించాల్సిన అవసరాన్ని చెప్పారు. విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకూడదని, అభిరుచులను కొనసాగించడానికి సమయం వెచ్చించాలని, ఇది మొత్తం అభివృద్ధిని పెంచుతుందని ఆయన నొక్కి చెప్పారు. క్రికెట్ నుండి ప్రేరణ పొంది, ప్రధానమంత్రి మోదీ, విద్యార్థులు బాహ్య ఒత్తిడి కంటే చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. జనసమూహ శబ్దం మధ్య బ్యాట్స్‌మన్ బంతిపై దృష్టి సారించినట్లే, విద్యార్థులు ఒత్తిడి గురించి చింతించకుండా నేర్చుకోవడంపైనే దృష్టి పెట్టాలన్నారు.

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రాముఖ్యతను కూడా ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. అనారోగ్యాన్ని నివారించడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే సరిపోదని ఆయన విద్యార్థులకు గుర్తు చేశారు. సరైన నిద్ర, సమతుల్య ఆహారం మొత్తం శ్రేయస్సుకు చాలా ముఖ్యమైనవని సూచించారు.ఇదే కార్యక్రమంలో కేరళ నుంచి వచ్చిన ఆకాంన్ష అనే విద్యార్థి ప్రధానిని హిందీలో పలకరించారు. ఇంత బాగా హిందీ ఎలా నేర్చుకుంటావని అడిగిన మోదీ ప్రశ్నకు సమాధానంగా.. తనకు హిందీ అంటే చాలా ఇష్టమని, తానొక కవిత కూడా రాశానని చెప్పారు. మీరు ప్రధాని కాకపోయుంటే ఏ మంత్రిత్వ శాఖ తీసుకుంటారని ఓ విద్యార్థి, ప్రదానిని అడగ్గా.. తనకు నైపుణ్యాభివృద్ధి అంటే ఆసక్తి అని మోదీ చెప్పారు.

కిరణ్ రాయల్‌పై విమర్శలు చేసిన లక్ష్మి అరెస్ట్

జనసేన నేత కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని ఆరోపణలు చేసిన లక్ష్మి.. సోమవారం ఉదయం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గ్రీవెన్స్ లో కిరణ్ రాయల్ వ్యవహారంపై ఆమె ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని, తనకు రావాల్సిన సొమ్ము ఇప్పించాలని ఎస్పీని కోరారు. అనంతరం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి తన బాధలు చెప్పుకున్నారు. ఇంతలో అకస్మాత్తుగా రాజస్థాన్ నుంచి వచ్చిన పోలీసులు ప్రెస్ క్లబ్ సమీపంలో లక్ష్మిని అరెస్టు చేశారు. ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జైపూర్‌లో లక్ష్మీపై పలు చీటింగ్ కేసులున్నట్లు సమాచారం. పలు రాష్ట్రాల్లోనూ లక్ష్మిపై కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు. పోలీసులు ఆమె కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే, కిరణ్‌ రాయల్‌పై ఆరోపణలు చేసిన వెంటనే ఆ మహిళను జైపూర్‌ నుంచి వచ్చిన పోలీసులు అరెస్ట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న ఆమెను, టీవీలలో కనిపించిన వెంటనే గుర్తించి అరెస్ట్ చేసారని చెబుతున్నారు. తరువాత ఆమెను పోలీసులు చెన్నై తరలించినట్లు సమాచారం.

తండేల్ సినిమాని పైరసీ చేస్తున్నవారిపై కేసులుపెట్టాం – అల్లు అరవింద్

పైరసీ పెద్ద క్రైమ్‌. తండేల్ సినిమాని పైరసీ చేస్తున్న వెబ్‌సైట్స్‌, వాట్సాప్‌, టెలిగ్రామ్‌, గ్రూప్‌ అడ్మిన్‌లకు ఇదే నా హెచ్చరిక. కేసులు పెట్టాం. మీరు జైలు వెళ్లే అవకాశం ఉంది: నిర్మాత అల్లు అరవింద్

కొంతమంది తెలిసి, మరికొంత మందికి తెలియక పైరసీ చేస్తున్నారు. క్రిమినల్‌ కేసు ఫైల్‌ అయితే, వెనక్కి తీసుకోలేము. యువత ఇందులో ఇరుక్కొవద్దు. ఈరోజు ప్రతిదీ ట్రాక్‌ చేయొచ్చు. మా సినిమా క్లిప్ ఒక్కటి ప్లే చేసినా కేసు పెడతాం: నిర్మాత బన్నీవాసు

”వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూప్‌ అడ్మిన్‌లకు ఇదే నా హెచ్చరిక. అడ్మిన్లు జాగ్రత్తగా ఉండండి. మీరు జైలు వెళ్లే అవకాశం ఉంది. మేము పట్టుదలతో ఉన్నాం. పైరసీ పెద్ద క్రైమ్‌. ఇప్పుడు సైబర్‌ సెల్స్‌ బాగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని పట్టుకోవడం కూడా తేలిక. నిన్న ఆర్టీసీ బస్సుల్లో సినిమా పైరసీ ప్రింట్‌ ప్రదర్శించడం డ్రైవర్ అమాయకత్వం’అన్నారు నిర్మాత అల్లు అరవింద్. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన మూవీ తండేల్. అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాను పైరసీ చేసి ఆన్‌లైన్‌లో పెట్టారు. అలాగే ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులోనూ ప్రదర్శించారు. దీనిపై చిత్ర నిర్మాతలు బన్నీవాసు, సమర్పకులు అల్లు అరవింద్‌ విలేకరుల నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీ అందరి సహకారంతో తండేల్ సినిమా సినిమా పెద్ద సూపర్ హిట్ అయింది. మా టీమ్ అంతా కలిసి ఆంధ్రాలో సక్సెస్ టూర్ చేస్తున్నారు. ప్రజల నుంచి చాలా అద్భుతమైనటువంటి స్పందన వస్తుంది. ఇవాళ కలవడానికి ముఖ్య ఉద్దేశం పైరసీ. నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్, ఓటీటీ చర్యల వల్ల కొన్ని సంవత్సరాలుగా సినిమా పైరసీ ఆగింది. అయితే రెండు నెలల నుంచి మళ్లీ పైరసీ రాక్షసి పడగ విప్పి నాట్యం ఆడుతోంది. మొన్న దిల్ రాజు గారి సినిమాని ఇలాగే ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. చాలా ప్రయత్నాలు చేసి, లింక్‌లు తొలగించాం. పైరసీపై పోరాటం చేసేందుకు ఫిల్మ్‌ ఛాంబర్‌లో సెల్ ఏర్పాటు చేశాం. వాళ్లు పగలూ రాత్రి పైరసీ నియంత్రణకు పనిచేస్తూ ఉంటారు. సమస్య ఏంటంటే, చాలా మంచి ప్రింట్‌ ఎక్కువగా వచ్చేస్తోంది. వాట్సప్ గ్రూపుల్లో లింకులను ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇలా చేస్తున్న వాట్సప్, టెలిగ్రామ్ గ్రూప్‌ల అడ్మిన్‌లను గుర్తించాం. వారిని సమాచారాన్ని సైబర్‌ క్రైమ్‌ దృష్టికి తీసుకెళ్లాం. వారందనినీ అరెస్ట్‌ చేయిస్తాం. వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూప్‌ అడ్మిన్‌లకు ఇదే నా హెచ్చరిక. అడ్మిన్లు జాగ్రత్తగా ఉండండి. మీరు జైలు వెళ్లే అవకాశం ఉంది. మేము పట్టుదలతో ఉన్నాం. ఇదొక క్రైమ్‌. ఇప్పుడు సైబర్‌ సెల్స్‌ బాగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని పట్టుకోవడం కూడా తేలిక. కొంతమంది వెబ్‌సైట్స్‌లోనూ పెడుతున్నారు. నిన్న ఆర్టీసీ బస్సుల్లో సినిమా పైరసీ ప్రింట్‌ ప్రదర్శించడం డ్రైవర్ అమాయకత్వం. సినిమా సక్సెస్ కావడనికి మీడియా వారు ఎంత సహకరించారో పైరసీని అరికట్టడానికి కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సినిమా సక్సెస్‌ను ఆస్వాదించే సమయంలో ఇదొక ప్రతిబంధకం అయింది. దయచేసి మీరంతా సహకరించాలని కోరుతున్నాను’ అన్నారు.

నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ..‘‘గత రెండేళ్ల నుంచి పైరసీ కంట్రోల్ లోకి వచ్చింది. ‘గీత గోవిందం’ తర్వాత చాలా ఫైట్ చేసిన కఠిన చర్యలు తీసుకోవడం వల్ల చాలా వరకూ తగ్గింది. ఓటీటీల రాకతో పైరసీ తగ్గుతూ వచ్చింది. అన్ని భాషలతో పోలిస్తే, తెలుగులో పైరసీని చాలా వరకూ కంట్రోల్ చేయగలిగాం. తెలుగులో ఎప్పుడూ లేని కల్చర్‌ గత రెండు నెలల కనపడుతోంది. ఈ సినిమా మా అందరి కష్టం. రెండేళ్లు ఎంతో శ్రమించాం. సినిమా బ్లాక్ బస్టర్ సాధించి మేము ఎంజాయ్ చేసే సమయంలో ఇలా జరిగింది. సోమవారం నుంచి టికెట్‌ రేట్లు తగ్గించాలని అల్లు అరవింద్‌ సూచించారు. అందుకు తగినట్లుగానే చాలా థియేటర్స్‌లో టికెట్‌ ధరలు తగ్గించాం. సినిమాను ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా ఉద్దేశం. మా బాధేంటంటే కొంతమంది తెలిసి, మరికొంత మందికి తెలియక ఇలాంటి పనులు చేస్తున్నారు. క్రిమినల్‌ కేసు ఫైల్‌ అయితే, వెనక్కి తీసుకోలేము. యువత ఇందులో ఇరుక్కొవద్దు. ఈరోజు ప్రతిదీ ట్రాక్‌ చేయొచ్చు. సైబర్‌ పోలీసులకు ఇది మరింత ఈజీ. ఈ రోజు కేసులు వేశాం. ఆర్టీసీ బస్సులో ప్రదర్శించడం మమ్మల్ని మరింత బాధించింది. మూడో రోజు సినిమాని ఎపీఎస్ ఆర్టీసీలో వేస్తే నిర్మాతలు ఇంకమేము ఏం చేయాలి. ఈ పైరసీలో మొదటి బాధితుడు పవన్‌కల్యాణ్‌గారు. ‘అత్తారింటికి దారేది’ ముందే విడుదలైంది. ఈ విషయాన్ని ఆయన దృష్టికీ తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాం. ‘‘తండేల్‌’ పైరసీ కాపీ 100శాతం ఓవర్సీస్‌ నుంచే వచ్చింది. ఇది తమిళ ప్రింట్‌ నుంచి వచ్చింది. దానికి తెలుగు ఆడియో కలిపారు. అది కూడా గుర్తించాం. క్యూబ్‌లో కోడ్‌ ఉంటుంది. కానీ, పైరసీ కాపీలో ఆ కోడ్‌లేదు. ఎక్కడి నుంచి వచ్చిందనే దానిని గుర్తించే పనిలో ఉన్నాం. ఈ విషయంలో నిర్మాతలకు మన ప్రభుత్వం చాలా బాగా సపోర్ట్‌ చేస్తోంది. పైరసీ చేసిన వాళ్లకి, దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్న వాళ్లకీ కేసులు వర్తిస్తాయి. సామాన్య ప్రజలు ఇందులో చిక్కుకోవద్దని కోరుతున్నా. కేబుల్ ఆపరేటర్‌లకు కూడా మా హెచ్చరిక. మా సినిమా క్లిప్ ఒక్కటి ప్లే చేసినా కేసు పెడతాం. చివరి వరకూ పోరాడుతాం.‘తండేల్’ పైరసీ చేస్తే 9573225069 నెంబర్ కు మెసేజ్ చేయండి. అభిమానులు చేయాల్సింది ఇదొక్కటే. సాక్ష్యాలు ఉంటే కచ్చితంగా న్యాయపోరాటం చేస్తాం. ముఖ్యంగా అక్కినేని అభిమానులకు చెబుతున్నాను. చైతన్య గారికి చాలా మంచి సినిమా తీసిఇచ్చాము. ఆయన కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ అయ్యే చాన్స్ వుంది. అన్ని విధాలుగా ప్రమోట్ చేస్తున్నాం. అలాంటి సినిమాని కాపడుకోవాల్సిన బాధ్యత మాతో పాటు మీకూ వుంది. పైరసీ జరిగితే ఈ నెంబర్ కి మెసేజ్ పెట్టండి’ అన్నారు.

కిరణ్‌రాయల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ వ్యవహారంపై బాధితురాలు లక్ష్మి సోమవారం జిల్లా ఎస్పీని కలిసి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసారు. తనకు న్యాయం చేయాలని, కిరణ్ రాయల్ చేసిన అన్యాయం మొత్తం ఆధారాలతో సహా అందజేసారు. డబ్బులు ఉన్నంత వరకు కిరణ్ రాయల్ తనను వాడుకున్నాడని, తన పిల్లలు భవిష్యత్ కోసం పోరాటం చేస్తున్నానని బాధితురాలు చెప్పారు. కిలాడి లేడీ అంటూ తనపై అసత్య ప్రచారం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అతని మాయ మాటలకు మోసపోయానని, తనపై లక్ష రూపాయలకు చెక్ బౌన్స్ కేసు ఉందన్నారు. అతనికి, తనకు కేసులు ఉన్నాయని, నిజం ఎప్పటికైనా బయట పడుతుందన్నారు. ఈ వివాదంతో తన కుటుంబ సభ్యులు తనను దూరం పెట్టారని, తన బిడ్డకు సర్జరీకి డబ్బులు అడిగితే కూడా తన నుంచి ఖాళీ చెక్ తీసుకున్నాడని తెలిపారు. తనపై నిందలు వేస్తున్నారని, తనను ఎంతో అవమానించాడని, తన వెనక పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఉన్నారంటూ భయపెట్టాడని బాధితురాలు ఎస్పీకి గోడు వెల్లబోసుకున్నారు. ఎన్నికలు అయిపోగానే మొత్తం నగదు తిరిగి ఇచ్చేస్తా అని చెప్పాడని, తాను అతను చెప్పింది నమ్మి మోసపోయానన్నారు. కిరణ్ రాయల్‌కు అమ్మాయిలను మోసం చేయమని పవన్ కల్యాణ్ చెప్పారా ? అని ప్రశ్నించారు. పార్టీకి దూరంగా ఉండాలని జనసేన ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందని, 2013 నుంచి కిరణ్ రాయల్‌తో సంబంధాలు ఉన్నాయని, 2015 తో ముగిశాయంటూ అసత్య ప్రచారం చేశాడన్నారు. మరో అమ్మాయిని కూడా ఇలాగే మోసం చేశాడని, అమ్మాయి జీవితం నాశనం చేశాడని లక్ష్మి ఆరోపించారు. ఆ తర్వాత తాను వచ్చానని.. తాను కాక వేరొక అమ్మాయితో చనువుగా ఉన్నాడని, అయితే, ఆమెకు కిరణ్ రాయల్ మోసగాడని చెప్పానన్నారు. ఆ అమ్మాయి జీవితం ఇబ్బంది పెట్టవద్దు అనుకుని ఇన్నాళ్లు బయట పెట్టలేదన్నారు. తనకు ఏపార్టీ మద్దతు లేదని, తనకు న్యాయం చేయాలని డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ను కోరుతున్నానన్నారు. ఇలాంటి నీచుడ్ని వదిలి పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. ఎంత మంది జీవితాలు నాశనం చేస్తాడో అని భయంగా ఉందన్నారు. తనకు డబ్బులు ఇస్తే లక్ష్మిని వదులు కుంటానని వేరొక మహిళతో చెప్పాడన్నారు. ఆ మహిళ తనతో మాట్లాడిన ఆడియో విడుదల చేసింది లక్ష్మి . వాళ్లింట్లోనే ఆ అమ్మాయిని కిరణ్ రాయల్ కొట్టాడన్నారు. ఇవన్నీ సాక్ష్యాలు చూసిన తర్వాత కొంత మంది సపోర్ట్ చేస్తున్నారంటే అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారన్నారు. అతని అవసరం తీరిపోతే వదిలిపోతాడని, అతని అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్పారు. తనకు ఇవ్వాల్సిన కోటి 20 లక్షల రూపాయలు ఇప్పించాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. కిరణ్‌ రాయల్‌ సన్నిహితులు , కిరణ్ రాయల్ కాణిపాకం కు వచ్చి ప్రమాణం చేస్తాడా? అని ప్రశ్నించారు. అలాచేస్తే.. తాను ఇప్పుడే వదులు కుంటా నని అన్నారు. ఇన్నాళ్లు తనను చంపుతాను అంటే భయపడ్డానని, అందుకే మీడియా ముందుకు వచ్చానన్నారు. తన అత్త నుంచి వచ్చిన ఆస్తులు అమ్మి నగదును కిరణ్‌కు ఇచ్చి మోసపోయానన్నారు. నా బాస్ వస్తున్నాడు డబ్బులు కావాలి అంటూ నాదగ్గర తీసుకున్నాడని, 25 సవర్ల బంగారం నా దగ్గర తీసుకున్నాడని ఆరోపించారు. కేవలం తనకు ఇప్పటివరకు 5లక్షలు మాత్రమే ఇచ్చాడన్నారు. గత పదేళ్లుగా అతను వాడే సెల్ ఫోనఃలు , అన్ని నేనే కొనిచ్చానని, అతను అనుభవిస్తున్న ప్రతి పైసా నాదే అని చెప్పారు. తనకు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఒత్తిళ్లు ఎక్కువ అయ్యాయని, అందుకే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానన్నారు. పార్టీ నాయకులతో ఫోన్ చేయించి బెదిరిస్తున్నాడని ఆరోపించారు. దయచేసి ఒక ఒంటరి మహిళకు న్యాయం చేయండి, వాస్తవాలు గ్రహించండని బాధితురాలు లక్ష్మి కోరారు.

హెల్త్ కేర్ సంస్థ కలర్స్ బంజారా హిల్స్ బ్రాంచ్ ప్రారంభం

▪️ ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ మూవీ మాదిరిగానే ‘కలర్స్‌’ కూడా బ్లాక్‌బ‌స్టర్ కావాలి
▪️ ఘ‌నంగా ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ యూనిట్‌ని ప్రారంభోత్స‌వం

‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ మూవీ ఫేమ్‌ ఐశ్వర్య రాజేష్ ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ ‘కలర్స్’ (Kolors Healthcare) బంజారా హిల్స్ బ్రాంచీలో సందడి చేసింది. ఈ సంద‌ర్భంగా ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ యూనిట్‌ని ప్రారంభించింది. ఆధునిక టెక్నాల‌జీతో ఈ సంస్థ‌ అందిస్తున్న సేవ‌ల‌ను ఆమె స్వ‌యంగా ప‌రిశీలించింది.

అనంత‌రం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ… ప్ర‌తి ఒక్క‌రికీ హెల్త్ కేర్ ఎంతో ముఖ్య‌మ‌ని, ఈ సేవ‌ల‌ను ఎంతో నాణ్యంగా, ఆధునిక టెక్నాల‌జీతో అందిస్తున్న ‘క‌ల‌ర్స్‌’ సంస్థ నిర్వాహ‌కుల‌ను ఆమె అభినందించింది. ప్ర‌తి ఒక్క‌రూ అందంగా, ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటాము. అలాంటి సేవ‌ల‌ను అందిస్తూ ఎంతో మందిని ఆరోగ్య‌ప‌రంగా సంతృప్తి ప‌రిచిన‌ సంస్థ ‘కలర్స్ హెల్త్ కేర్’ అని కొనియాడారు. ”లైఫ్‌స్టైల్ బాగుండాల‌ని కోరుకునే వారంద‌రికీ ఈ సంస్థ మెరుగైన సేవ‌లు అందిస్తూ ఇప్పుడు ఆధునిక సాంకేతిక‌త‌ను జోడించుకుని ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’గా ఎద‌గ‌డం సంతోషం. ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ మూవీ మాదిరిగానే ‘కలర్స్‌’ కూడా బ్లాక్‌బ‌స్టర్ కావాలి” అని ఐశ్వర్య రాజేష్ ఆకాంక్షించారు.

‘కలర్స్ హెల్త్ కేర్’ సీవోవో శివాజీ కూన మాట్లాడుతూ.. 2004లో ప్రారంభించిన ‘కలర్స్ హెల్త్ కేర్‌’ సేవ‌ల‌కు మ‌రింత అడ్వాన్స్ టెక్నాల‌జీని జోడిస్తూ ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించినట్టు తెలిపారు. ఇప్ప‌టికీ 50 బ్రాంచీలు ఉన్న త‌మ ‘కలర్స్ హెల్త్ కేర్‌’ను వ‌చ్చే ఏడాది చివ‌రి క‌ల్లా దేశవ్యాప్తంగా 250 బ్రాంచీల‌కు విస్త‌రించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

‘కలర్స్ హెల్త్ కేర్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ రాయుడు మాట్లాడుతూ.. యూఎస్ – ఎఫ్డీఏ అఫ్రూవుడ్ టెక్నాల‌జీతో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించినట్టు తెలిపారు.

‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ యూనిట్‌ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా అతిథులుగా పాల్గొన్న‌ మిన‌ర్వా హోట‌ల్స్ అధినేత‌, మాజీ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, సీబీఐటీ డైరెక్ట‌ర్ దివ్యారెడ్డి నిర్వాహ‌కుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

జాతీయ కరాటే టోర్నమెంట్‌లో జేఎస్‌కెఎస్ విద్యార్థుల హవా

వరంగల్‌ జిల్లా నర్సంపేటలోని ఎం.ఏ.ఆర్ గార్డెన్స్‌లో జరిగిన షటోకాన్ జపాన్ కరాటే డు ఇండియా హంబ్ నేషనల్ ఇన్విటేషన్ కరాటే 2024-25 టోర్నమెంట్‌లో గోదావరిఖనికి చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఈ టోర్నమెంట్‌లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుండి విద్యార్థిని విద్యార్థులు పాల్గొనగా.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన జపాన్ షిటోరియో కరాటే స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ప్రత్యేకమైన ప్రతిభ కనబరిచి కటాస్, కుమితి విభాగంలో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు. బ్లాక్ బెల్ట్ కటాస్ విభాగంలో హేమలత మహజి, స్నేహ సుల్తానా, ఎం ముక్తిశ్రీ బంగారు పతకాలు సాధించారు. బ్లాక్ బెల్ట్ కుమితి విభాగంలో హేమలత మహజి, ఎం ముక్తిశ్రీ బంగారు పతకాలు సాధించగా.. సునీహసుల్తానా వెండి పతకం సాధించింది. అలాగే, కలర్ బెల్స్ కటాస్ విభాగంలో శివాష్ష్, ఎం కార్తికేయన్, పి మోహిత్ బంగారు పతకాలు సాధించగా.. రోహన్, అక్షిత్ రెడ్డి, కార్తిక, శ్రీ వర్షిని, కీర్తి మహాజీ, సిహెచ్ అశ్విన్, ఏ మనస్విని, సంయుక్త, టి పవన్ కుమార్, రిషి వరుణ్, ఎండి సుహాన్ , పి శ్రీ రాజ్ వెండి పతకాలు సాధించారు. కలర్ బెల్స్ కుమితి విభాగంలో కీర్తి మహజి, సంయుక్త, ఏ మనస్విని బంగారు పతకాలు సాధించగా.. రోహన్, కార్తికేయన్ వెండి పతకాలు సాధించారు.

ఈ ఇన్విటేషన్ నేషనల్ కరాటే టోర్నమెంట్ లో పతకాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులను మరియు కోచ్ కరాటే శ్రీనివాస్ ను జపాన్ షిటోరియో కరాటే స్కూల్ ప్రెసిడెంట్ తగరపు శంకర్, జపాన్ షిటోరియో కరాటే స్కూల్ సెక్రెటరీ ఎం రమేష్, సీనియర్ ఇన్‌స్ట్రక్టర్స్ ఎస్ శ్రీనివాస్, శ్రావణ్ కుమార్ పటేల్, నిదిష్ కుమార్, రోహిత్ కుమార్, సంజన, శుభశ్రీ, అభిజ్ఞ,స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ గణేష్ రాజ్ తదితరులు ప్రత్యేకంగా అభినందించారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com