36.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

బీజేపీ టార్గెట్‌ తమిళనాడు?

భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో పాగా వేసేందుకు, పట్టు పెంచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే తమిళనాడులో కొద్ది రోజులుగా రాజకీయ డ్రామాలను ప్లాన్‌ చేస్తోంది. పాత మిత్రుడితో కలిసి తమిళనాట అధికారాన్ని పంచుకునేందుకు ప్లాన్లు వేస్తోంది.

తమిళనాడులో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అధికారంలో కొనపాగుతున్న డీఎంకే పార్టీ.. గతంలో మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ, ఇతర మిత్ర పక్షాలతో కలిసి ఈసారి కూడా కూటమిగానే బరిలోకి వెళ్ళాలని చూస్తోంది. అటు.. సొంత పార్టీని ఏర్పాటు చేసిన నటుడు విజయ్ తాను ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఏఐడీఎంకేతో కలిసి పోటీ చేసి అధికార భాగస్వామ్యంతో డిప్యూటీ సీఎంగా బీజేపీకి అవకాశం ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన ఫార్ములా మాదిరిగానే తమిళనాడులో కూడా విజయ్ రాజకీయాల్లో తన ప్రయత్నాలు చేస్తారని ఇన్నాళ్లుగా చర్చ జరిగింది. అయితే, బీజేపీ మాత్రం అధికార డీఎంకే ను ఈసారి గద్దెదించేందుకు పక్కా ప్రణాళికతో వెళ్తున్న క్రమంలో.. తమిళనాడులో రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార డీఎంకేను గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు అన్నీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకు మంచి ఓటు బ్యాంకు కలిగిన పార్టీలతో కలిసి వెళ్తేనే అది సాధ్యమని విశ్లేషకులు చెబుతుంటే.. విపక్షాల వ్యూహాలను డీఎంకే మాత్రం లెక్క చేయడంలేదు. బీజేపీ ఈసారి దక్షిణాన కచ్చితంగా కొట్టి తీరాలన్న కసితో చేస్తున్న ప్రయత్నాలు చాలానే ఉన్నాయి. అలా బీజేపీ వేస్తున్న ఎత్తులకు డీఎంకే పైఎత్తు వేస్తోంది. జనంలో సెంటిమెంట్‌ను రెచ్చగొడుతూ ప్రతిపక్షాలకు చిక్కకుండా వ్యూహాలు రచిస్తోంది.

అటు.. తమిళనాడులో పాగా వేయాలన్న ప్రయత్నాల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ.. తనదైన వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. అయితే, ఎక్కడో తేడాగా ఉందన్న చర్చ జరుగుతోంది. పొత్తు కోసం ఏఐడీఎంకే నుంచి దూరమైన అందరినీ కలిపేలా బీజేపీ ప్లాన్ చేస్తోందని అంటున్నారు. పొత్తులను సెట్ చేయడంలో భాగంగా మాజీ సీఎంలు పన్నీర్ సెల్వం, పళనిస్వామి, శశికళను కలిపి బీజేపీ కూటమి కోసం ప్రయాత్నాలు చస్తోంది. అయితే, ఆ ప్రయత్నాలకు ఏఐడీఎంకే షరతులు పెడుతోందని అంటున్నారు. అలా పెడుతున్న షరతుల్లో కొన్ని విషయాల్లో తగ్గుతున్నప్పటికీ.. మరి కొన్ని అంశాల్లో బీజేపీ ఏమాత్రం తగ్గడం లేదట. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన ఏడీఎంకే సహా మరి కొన్ని పార్టీలను కలిపి కూటమిగా ఏర్పాటు చేసి అధికారంలోకి రావాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఐదేళ్ల క్రితం వరకూ తమిళనాడులో డీఎంకేతో సమానంగా బలమైన పార్టీగా ఉన్న ఏఐడీఎంకేలో చీలిక రావడంతో ఆ పార్టీ కాస్త బలహీన పడింది. గతంలో జయలలిత జైలుకు వెళ్లిన సందర్భంలో నమ్మిన బంటుగా ఉన్న పన్నీరు సెల్వం పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే, జయలలిత నెచ్చలి శశికళ కూడా పార్టీకి దూరమైంది. మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రస్తుతం పార్టీని లీడ్ చేస్తున్నారు. అయితే, గత వైభవం రావాలంటే, పార్టీ బాగుండాలంటే ఈ ముగ్గురు కలవాల్సిన అవసరం ఉందని బీజేపీ భావిస్తోంది. అందుకే వీళ్లందరినీ కలిపేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.

ఈ క్రమంలోనే ఇటీవల పొత్తుల విషయంపై చర్చించేందుకు ఏఐడీఎంకే ప్రధాన కార్యదర్శి. మాజీ సీఎం పళని స్వామి ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటు.. పలువురు బీజేపీ ముఖ్య నేతలను కూడా కలిశారు. అయితే, ఆ సమయంలో బీజేపీకి ఏఐడీఎంకే తరఫున పళని స్వామి కొన్ని షరతలు పెట్టినట్టు తెలుస్తోంది. అందులో ముఖ్యమైనది తమిళనాడు బీజేపీ చీఫ్ గా ఉన్న అన్నామలైని ఆ బాధ్యతల నుంచి పక్కన పెట్టాలని కోరినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే.. ఇటీవల అన్నామలై తమిళనాడు పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. అలాగే, ఏఐడీఎంకే పార్టీలోకి పన్నీరు సెల్వంను మళ్లీ తీసుకొచ్చే ప్రతిపాదనను కూడా ఆయన విభేదించినట్లు తెలుస్తోంది. తమిళనాడులో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో పొత్తుల విషయమై మాట్లాడేందుకు మాజీ ముఖ్యమంత్రులు ఈపీఎస్-ఓపీఎస్ ఇద్దరికీ వేరువేరుగా మోదీ అపాయింట్‌మెంట్ ఫిక్స్ అయింది. ఓపిఎస్‌కూ కూడా అపాయింట్‌మెంట్ దక్కడం పట్ల ఈపీఎస్ కినుక వహించినట్టు తెలుస్తోంది. అందుకే ప్రధానిని కలిసే ఆలోచనను విరమించుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి ప్రధాని షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు ప్రకటన వచ్చింది. ఎలాంటి రాజకీయ సమావేశాలు భేటీలు లేవని ఓపీఎస్ అపాయింట్‌మెంట్ కూడా రద్దు చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల తమిళనాడు చీఫ్ పదవికి రాజీనామా చేసిన అన్నామలై కూడా అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. మీడియాతో మాట్లాడిన సందర్భంలో అధ్యక్ష పదవి అనేది తనకు ఉల్లిపాయతో సమానం అంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీశాయి. ఓపీఎస్- టిటివి దినకర్, శశికళ, పళని స్వామి అందరిని కలపాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు ఈపీఎస్ సుముఖంగా లేరన్నది తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. వీటన్నింటిపై బ్యాక్ గ్రౌండ్‌లో అన్ని వర్కవుట్‌ చేసుకున్నాక పొత్తులపై ముందుకు వెళ్లాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే మోదీ పర్యటన షెడ్యూల్‌లో మార్పులు చేసి పొలిటికల్ మీటింగ్స్ అన్నీ రద్దు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే రెండు మూడు రోజుల్లో రాష్ట్ర అధ్యక్షుడిని నియమించిన తర్వాత పరిస్థితులను చక్కదిద్దిన తర్వాత పొత్తుల విషయంలో క్లారిటీ ఇవ్వాలని భావిస్తోంది భారతీయ జనతా పార్టీ.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com