ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. ఇవాళ మధిర నియోజకవర్గంలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాను ప్రారంభించారు. ఈ జాబ్ మేళా ద్వారా ఒకేరోజు 5వేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ జాబ్ మేళాకు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఆ కొద్ది మందికే ఉద్యోగాలు దొరికాయని, పదేళ్లలో నిరుద్యోగులకు ఉద్యో్గాలు ఇవ్వలేక పోయారని విమర్శించారు.
ఈ జాబ్ మేళాకు సంబంధించిన దృశ్యమాలిక భాస్కర న్యూస్ పాఠకుల కోసం…