26.7 C
Hyderabad
Saturday, April 25, 2026

Live Video

spot_img

ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం – భట్టి హామీ

  • రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందించిన ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు

  • సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం

  • త్వరలోనే విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ

ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి తెలిపారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం ఉదయం ప్రజా భవన్ లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను లచ్చిరెడ్డి డిప్యూటీ సీఎం కు వివరించారు. ఇందులో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ తో పాటు రాష్ట్ర స్థాయిలో మా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ అనివార్యత ను వివరించారు.

ఉద్యోగుల జేఏసీ చైర్మన్, నాయకుల వినతిపై సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి భట్టి.. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని, త్వరలోనే పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడుదల చేస్తామని హామీనిచ్చారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.రామకృష్ణ, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు రాములు, జనరల్ సెక్రటరీ రమేష్ పాక తదితరులు ఉన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com