– పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న భట్టి విక్రమార్క
– బోనకల్ గురుకుల పాఠశాల విద్యార్థులతో సహపంక్తి భోజనం
– కాంగ్రెస్ నాయకులు అంబటి వెంకటేశ్వరరావుకు పరామర్శ
– బోనకల్ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
– మధిరలో ఆర్‌అండ్‌బి డ్రైన్స్ & ఫుట్‌పాత్‌కు శంకుస్థాపన
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శని, ఆదివారాల్లో మధిర నియోజకవర్గంలో పర్యటించనున్నారు. శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పర్యటిస్తారు. ఆయన ఏ సమయంలో ఎక్కడెక్కడ పర్యటిస్తారో, ఏ అభివృద్ధికార్యక్రమాల్లో పాల్గొంటారో కింద వివరంగా చూద్దాం…
శనివారం (14-12-2024)
9:20AM – చింతకాని మండలం నాగులవంచ గ్రామం
ఇటీవల పితృ వియోగం పొందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
అంబటి వెంకటేశ్వరరావు కుటుంబానికి పరామర్శ
11:00 AM – బోనకల్ మండలం ముసికుంట్ల గ్రామం
ఎన్ఆర్ఈజీఎస్ రోడ్డు ప్రారంభోత్సవం
11:40 AM – 2: 20PM
– బోనకల్ బీసీ గురుకుల పాఠశాల
విద్యార్థులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భోజనం
2:30 PM – రూ.19.45 లక్షలతో నిర్మించే ఎన్ఆర్ఈజీఎస్ రోడ్డుకు శాంతినిలయం వద్ద శంకుస్థాపన
3:00 PM – రావినూతల గ్రామం
ఎన్ఆర్ఈజీఎస్ రోడ్డుకు శంకుస్థాపన
3:30 PM – గోవిందపురం గ్రామంలో ఐదు రోడ్లకు శంకుస్థాపన
5:15 PM – జానకిపురం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ రోడ్డుకు శంకుస్థాపన
6:00 PM – రాపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం, ఎన్ఆర్ఈజీఎస్ రోడ్లకు శంకుస్థాపన
6:45 PM – రంపిమల్ల గ్రామంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన
ఆదివారం (15-12-2024)
అలాగే, ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర గ్రామంలో ఆర్ అండ్ బి రహదారి పక్కన నిర్మించనున్న ఫుట్ పాత్, డ్రైన్స్ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ముదిగొండ మండలం వి.వి కిష్టాపురం గ్రామానికి చేరుకుని మట్టా బాబురామ్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరవుతారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.