తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు వరంగల్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. తృటిలో కాన్వాయ్‌కు ఘోర ప్రమాదం తప్పింది. డిప్యూటీ సీఎం వరంగల్ వెళ్తున్న క్రమంలో జనగామలోని కళాతోరణం వద్ద భట్టి కాన్వాయ్‌లోని ఒక పోలీస్ వెహికిల్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పోలీసు వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనలో ఆ వాహనంలో ఉన్న ఎస్ఐ చెన్నకేశవులు, డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. అయితే, అనుకోని ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం భట్టి వరంగల్ పర్యటనకు బయలు దేరారు.