28.6 C
Hyderabad
Thursday, November 5, 2026

Live Video

spot_img

నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్షం – భట్టి, జానారెడ్డి లేఖలు

  • జరగబోయే ప్రమాదం గురించి చర్చిద్దాం రండి

  • అన్ని రాజకీయ పార్టీలకు పిలుపు

  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ నేత జానారెడ్డి లేఖ

తెలంగాణ కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం ప్రకారం నియోజక వర్గాల పునర్విభజనపై అఖిలపక్ష పార్టీల సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనాభా ప్రాతిపదికన జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉంది. జరగబోయే నష్టం గురించి అన్ని పార్టీలను ఆహ్వానించి చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశానికి అన్ని పార్టీలు హాజరుకావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి సంయుక్తంగా బుధవారం బహిరంగ లేఖ విడుదల చేశారు. ప్రతి పార్టీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని బహిరంగ లేఖలో తెలిపారు. త్వరలోనే తేదీ, వేదిక ప్రకటిస్తామని బహిరంగ లేఖ ద్వారా వారు స్పష్టం చేశారు.అయితే, ఈ అఃంశంపై ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్‌ కూడా దక్షిణాదికి అన్యాయం పేరుతో ఉద్యమం మొదలు పెట్టారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com