హైదరాబాద్ నగరం 72వ మిస్ వరల్డ్ – 2025 పోటీలకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమైంది. మే 7వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ ప్రతిష్ఠాత్మక అందాల పోటీలు జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 140 దేశాలకు చెందిన అందమైన మహిళలు ఈ పోటీల కోసం హైదరాబాద్‌కు తరలిరానున్నారు. పోటీలో పాల్గొనే కంటెస్టెంట్లు మే 6,7 తేదీల్లో నగరానికి చేరుకోబోతున్నారు.
మిస్ వరల్డ్ పోటీల ప్రాముఖ్యతను మరింతగా చాటేందుకు ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా, మిస్ ఇండియా 2023 విజేత నందిని గుప్తా కలిసి ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. పోటీలు ప్రారంభమయ్యేందుకు కేవలం కొద్దిరోజులే మిగిలి ఉండటంతో, ఏర్పాట్లు ఊపందుకున్నాయి. నగరంలోని వేదికలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు.
ఈ గ్రాండ్ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ప్రపంచంలోని అందమైన మహిళలంతా ఒకే వేదికపై మేళవించనున్న ఈ పోటీలు, హైదరాబాద్‌కు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకురానున్నాయి. ఈ అద్భుతమైన వేడుక కోసం నగర ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.