25.2 C
Hyderabad
Wednesday, September 16, 2026

Live Video

spot_img

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తప్పు

ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయనని టివి యాంకర్ శ్యామల స్పష్టం చేసింది. ఈ రోజు విచారణ కోసం హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వచ్చిన శ్యామలను  సుమారు రెండు గంటల పాటు  పోలీసులు విచారించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడింది.

బెట్టింగ్ యాప్స్ అంశంపై విచారణ జరుగుతోందని, ఈ అంశం కోర్టు పరిధిలో ఉండగా కామెంట్ చేయటం సరికాదని వివరణ ఇచ్చింది. ఇప్పుడు ఈ అంశంపై స్పందించలేనని శ్యామల స్పష్టం చేసింది. పోలీసు విచారణకు సహకరిస్తానని చెప్పిన యాంకర్ తనకు చట్టాలపై నమ్మకం ఉందని వెల్లడించింది.

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయటం తప్పని…నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ లోటు తీర్చలేనిదని శ్యామల విచారం వ్యక్తం చేసింది.

ఒక సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాంకర్ శ్యామలపై పంజాగుట్ట పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ శ్యామల హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌ విచారించిన హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. శ్యామలను అరెస్టు చేయవద్దని, నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com