ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత్ క్రికెట్ జట్టు సభ్యులతో ఆదేశ ప్రధాని అంధోని అల్బనీస్ తో భేటీ అయ్యారు. కాన్‌బెర్రాలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ & టీమ్ ఇండియా ఆటగాళ్లతో ఆస్ట్రేలియా ప్రధాని కాసేపు ముచ్చటించారు. ముఖ్యంగా పెర్త్ లో జరిగిన తొలి టెస్ట్ లో భారత జట్టు ప్రదర్శనను ఆయన అభినందించారు. తొలి టెస్టులు సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీని ప్రత్యేకంగా ఆయన అభినందించారు. బుమ్రా బౌలింగ్ గురించి ప్రస్తావిస్తూ మీ ఆట అద్భుతమని కొనియాడారు.