మరోసారి దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య స్థాయి ఏక్యూఐ 300కి చేరిపోయింది. గ్యాస్ చాంబర్‌లా మారి రోజురోజుకు అక్కడ కాలుష్యం పెరుగుతూనే ఉంది. గాలి కాలుష్యం వల్ల కంటి నొప్పులు, గొంతు సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఢిల్లీలో కాలుష్యం కంట్రోల్ చేయడంలో అధికారులు విఫలమవుతున్నారంటూ ఇప్పటికే సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది.
పర్మిషన్ లేని వాహనాలను ఢిల్లీలోకి అనుమతించినందుకు అధికారులపై , రూల్స్ అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం.. అనుమతి లేని వాహనాలను రాజధానిలోకి ప్రవేశించకుండా కట్టడి చేస్తామని హామీ ఇచ్చింది.