పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సభ్యులకు బహుమతులపై దుమారం మొదలైంది. CPI(ML) ఎంపి రాసిన లేఖ ఢిల్లీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఉభయసభల లాబీల్లో హాట్ టాపిక్ గా మారింది.
రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ నాయకత్వంలో రైల్వే స్టాండింగ్ కమిటీ స్టడీ టూర్‌లో సభ్యులకు ఖరీదైన కానుకలు ఇవ్వడంపై బిహార్ ఎంపీ, రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యులు సుదామ ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు..
సభ్యులకు ఇచ్చిన కానుకల్లో ఒక గ్రాము బంగారం, వంద గ్రాముల వెండి ఉండడాన్ని సుదామ ప్రసాద్ గ్రహించారు. ప్రజాధనాన్ని దుబారా చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. బీహా ఎంపి తన గిఫ్ట్ ప్యాక్ ను వెనక్కి పంపించేశారు.
ప్రజా సేవ చేయడానికి వచ్చాం గనుక ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయరాదంటూ ఎంపీ రమేశ్‌కు ఆయన లేఖ రాశారు. ఈ లేఖ రైల్వే శాఖలో ప్రకంపనాలు సృష్టిస్తోంది.