సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు నమోదు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కుటుంబ వివరాలు నమోదు చేసుకున్న ఎన్యుమరేటర్, అధికారులు సర్వే పురోగతిపై ముఖ్యమంత్రికి వివరాలు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇంలంబర్తి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉందని అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం…హైదరాబాద్ పరిధిలో వీవీఐపీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వివరాలు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. వీలయినంత త్వరగా కుల సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.