34.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

అశ్వనీ కుమార్.. ముంబై మరో సంచలన ప్లేయర్..

ముంబై ఇండియన్స్ నుంచి మరో అణిముత్యాన్ని దేశానికి పరిచయం చేసింది. చాన్స్ వచ్చిన తొలి మ్యాచ్‌లోనే తన సత్తా ఏంటో చాటుకున్నాడు యువ పేసర్ అశ్వనీ కుమార్. తొలి బాల్‌కే KKR సారథి రహానేను ఔట్ చేసి తన సత్తా ఏంటో చాటాడు ఈ బౌలర్. 3 ఓవర్లు వేసి 24 రన్స్ ఇచ్చి ఏకంగా 4 వికెట్లు తీశాడు. ఇప్పటికే విఘ్నేష్‌ పుతూర్.. చెన్నైకి చెమటలు పట్టిస్తే.. అశ్వనీ కోల్‌కతా బ్యాటర్లను శాసించాడు.

ఐపీఎల్ పుణ్యమా అని దేశంలోని యంగ్ టాలెంట్‌కు గుర్తింపు దక్కుతుంది. అందులోనూ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అయితే దేశానికి అనేక అణిముత్యాలను అందించింది. జస్‌ప్రీత్ బుమ్రా, హర్దీక్ పాండ్యా, తిలక్ వర్మ,.. ఇలా అనేక మంది ఇక్కడి నుంచే దేశానికి వెళ్లారు. ఇప్పుడీ లిస్ట్‌లో విఘ్నేష్‌ పుతూర్‌తో పాటు అశ్వనీ కుమార్ కూడా చేరాడు.

అశ్వనీ కుమార్ పంజాబ్ నుంచి వచ్చిన లెఫ్ట్ హ్యాండ్ బౌలర్. 23 ఏళ్ల ఈ క్రికెటర్ పంజాబ్ నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. లాస్ట్ ఇయర్ షేర్ ఈ పంజాబ్ టీ20 ట్రోఫిలో తన సత్తా చాటాడు. ఇంకేముంది ముంబై ఇండియన్స్ స్కౌట్ల దృష్టిలో పడ్డాడు. ఆ టోర్నీలో డెత్ బౌలింగ్‌లో తన సత్తా చాటడంతో ముంబై టీమ్‌లో చేరిపోయాడు.

రూ.30 లక్షల బేస్ ప్రైస్‌కు అశ్వనీని దక్కించుకుంది ముంబై. అయితే ఐపీఎల్ ఎంట్రీ ముంబైతోనే ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ పంజాబ్‌ కింగ్స్‌తోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. కానీ ముంబై కొనుగోలు చేయడంతో పాటు.. మూడో మ్యాచ్‌లో తన చేతికి బాల్‌ను అందించింది. దీంతో అంది వచ్చిన అవకాశాన్ని ప్రూవ్ చేసుకున్నాడు.

ఇక డెబ్యూ మ్యాచ్‌లోనే కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు అశ్వనీ. తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు పడగొట్టిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు అశ్వని. అంతేకాదు MI తరపున తొలి బంతికే వికెట్ తీసిన రెఎండో బౌలర్‌గా అశ్వనీ నిలిచాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com