రాష్ట్ర వ్యాప్తంగా నరేగా ద్వారా 23,368 గోశాలలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బుధవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరేగా ద్వారా 25 వేల ఎకరాలలో పశుగ్రాసం పెంచాలని కలెక్టర్లకు సూచించారు. పాలు, పౌల్ట్రీ ఉత్పత్తుల్లో 15 శాతం అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. అలాగే 2582 ఫెర్టిలిటీ కేంద్రాలను రాష్ట్రం మొత్తం ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖపట్నం, విజయనగరం, చిత్తూరు జిల్లాలు పాల ఉత్పత్తిలో అగ్రస్ధానంలో ఉన్నాయన్నారు. ఇక మత్స్య సంపద విషయానికి వస్తే ఏటా 12 శాతం వృద్ధి లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళే బోట్లకు శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్ధ ఏర్పాటు చేయాలన్నిరు. డ్రోన్లు, ఏఐ సహాయంతో ఆక్వా సాగును ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రైతులకు అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తోందని చంద్రబాబు చెప్పారు. పశు సంవర్ధక మరియు మత్స్య శాఖల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఉత్పత్తిని పెంచాడమే ప్రభుత్వ లక్ష్యంమని కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు పునరుద్ఘాటించారు.
- Advertisement with us -