ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆత్మార్పణ చేసి అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా ఆయన స్మరించుకుంటూ సభ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రలు నారాయణ, అచ్చెనాయడు, పార్థసారధి తదిరులు పాల్గొన్న సభలో పవన్ కళ్యణ్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రాలకు కారణభూతడన్నారు. ఆయన ఒఖ కులానికో, జాతికో నాయకుడు కాదని ఆంధ్ర జాతికి నాయకుడని కొనియాడారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి చెయ్యడమే పొట్టి శ్రీరాములుకు మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణపై రూపొందించిన పుస్తకాన్ని విడుదల చేశారు. అనంతరం ఆయనపై డాక్యుమెంటరీని ప్రదర్శించారు.
- Advertisement with us -