అల్లు అర్జున్ ఆదివారం మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్ళారు. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా చిక్కడపల్లి సంధ్యా ధియేటర్ బయట జరిగిన తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ శనివారం విడుదలైన విషయం తెలిసిందే. శనివారం రోజంతా తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన సినీ తారలు స్వయంగా వచ్చి, పలువురు ఫోన్ల ద్వారా అల్లు అర్జున్ ని పరామర్శిస్తూనే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి, అల్లు అర్జున్ మేనత్త సురేఖ కూడా మేనల్లుడ్ని చూడటానికి వచ్చారు. ఆదివారం అల్లు అర్జున్ ఆయన సతీమణి స్నేహారెడ్డిని తీసుకుని స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనతో చాలా సేపు గడిపారు. గడచిన మూడు రోజులుగా జరిగిన పరిణామాలపై ఇరువురు చర్చించుకున్నట్లు సమాచారం.