37.2 C
Hyderabad
Wednesday, April 22, 2026

Live Video

spot_img

బెనిఫిట్ షోలపై ఏపి నేతల అసంతృప్తి గళం

పుష్ప సినిమా విడుదల, తొక్కిసలాట, బెన్ ఫిట్ షో, హీరో అరెస్టు తదితర ఆంశాలపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. పుష్పరాజ్ బెన్ ఫిట్ షో అనుమతులపై రాజకీయ పార్టీల్లో కూడా విభేదాలు తలెత్తినట్టు కనిపిస్తోంది. తాజాగా ఏపి నేతలు బెనిఫిట్ షోలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

బిజెపిలో కేంద్రమంత్రుల దగ్గర నుంచి రాష్ట్ర నేతల వరకు పుష్పరాజ్ కు అండగా ఉండగా విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు బెని ఫిట్ షోలపై మండిపడ్డారు. ఎవరి లాభం కోసం టికెట్ల ధరలు పెంచుతున్నారని విమర్శలు గుప్పించారు. పైగా సీనియర్ నేతల వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీలు పురుందేశ్వరి, డి కె అరుణ చేసిన కామెంట్స్ వారి వ్యక్తిగతమన్నారు.

పుష్పా సినిమా తదనంతర పరిణామాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆయన ఫోన్ కు మెసేజ్ చేసినట్టు విష్ణు కుమార్ రాజు మీడియాకు వెల్లడించారు.

మరోవైపు మాడుగుల ఎమ్మెల్యే, టిడిపి నేత బండారు సత్యనారాయణ మూర్తి కూడా బెనిఫిట్ షోల పేరుతో టికెట్ల ధరలు పెంచటం సరికాదని ముక్తాయింపు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం సినీ పరిశ్రమతో సత్సంబంధాలు కొనసాగిస్తుండగా… బండారు విమర్శలు చేశారు. సీనియర్ నేత బండారు వ్యాఖ్యలపై పార్టీలో చర్చ జరుగుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com