విద్యుత్ ఒప్పందాల విషయంలో గత YSRCP ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారని YSRCP అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఛత్తీస్గఢ్, ఒడిశా, తమిళనాడు కంటే.. ఏపీకి తక్కువ రేటుకే విద్యుత్ వచ్చిందని వెల్లడించారు. తక్కువ రేటుకు విద్యుత్ తీసుకొస్తే సన్మానించాల్సింది పోయి మాటలంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను సంపద సృష్టి చేస్తే.. బాబు ఆవిరి చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.
జగన్ ప్రెస్ మీట్ ముఖ్యంశాలు
ధర్మం లేదు.. మంచి చేసినోడిపై రాళ్లు వేస్తున్నారు. రాజస్తాన్లో జనరేట్ చేసి అక్కడే సరఫరా చేస్తున్నారు. అక్కడ ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉండవు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వక్రీకరణ చేసి రాస్తున్నాయి.. వాటి మీద పరువు నష్టం దావా వేస్తాం. చంద్రబాబు, ఎల్లోమీడియా వక్రీకరించి మాట్లాడటం ధర్మమేనా? గుజరాత్ కు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు వర్తించవు. ఇప్పుడు గుజరాత్లో సెకీ పిలిచిన..
టెండర్ల రేట్లు రూ.2.62కు తక్కువ లేవు.
డిసెంబర్ 1న సెకీ, ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగింది. పవర్ సేల్ అగ్రిమెంట్ జరిగింది. ఒప్పందంలో సెకీ, ఏపీ ప్రభుత్వం, డిస్కమ్ల సంతకాలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన..ఒప్పందంలో థర్డ్ పార్టీ ఎక్కడుంది? ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ మినహాయిస్తూ.. ఒప్పందంలో స్పష్టంగా ఉంది. రూ.2.49కు విద్యుత్ సరఫరా ఒప్పందం జరిగింది. దీనికి సీఈఆర్సీ అనుమతి కూడా వచ్చింది. చారిత్రాత్మక ఘట్టం జరిగితే దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంత మంచి ఆఫర్ను పక్కనపెడితే ఏమనేవారు? 25ఏళ్లలో రూ.లక్ష కోట్ల సంపద ఆదా అవుతుంది.