రంగరాజన్ పై దాడి అమానవీయ చర్య అని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ను ఈ రోజు పరామర్శించిన జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
సౌందర్య రాజన్ ను కలిసి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన శ్రీధర్ బాబు, మహేందర్ రెడ్డిలు దాడి ఘటనను అడిగి తెలుసుకున్నారు. రాముని పేరుతో దాడులు చేస్తే సహించేది లేదని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు. నిందితుల్లో ఇప్పటికే కొందరిని పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు.
రామరాజ్యం పేర అరాచకాలు సాగిస్తే సహించేది లేదని… చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద భద్రత పెంచమని మంత్రి శ్రీధర్ బాబు జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.