24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

సామాజిక విప్లవ దార్శనికుడు అంబేద్కర్ – వైఎస్.జగన్

భార‌త రాజ్యాంగ రూప‌కర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సామాజిక విప్ల‌వ దార్శ‌నికుడని మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహనరెడ్డి అన్నారు. శుక్రవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మహనీయుడు అంబేద్కర్ స్పూర్తి సమాజానికి ఎల్లవేళలా మార్గదర్శంగా నిలిచేందుకే విజయవాడ స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశామని జగన్ చెప్పారు. అంబేద్కర్ మహాశయుడి జీవితం అందరికీ ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్‌, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌ కుమర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌ రావు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు, వైఎస్సార్‌సీపీ నాయకులు వరికూటి అశోక్‌బాబు, కాకుమాను రాజశేఖర్‌, కొమ్మూరి కనకారావు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com