32.2 C
Hyderabad
Monday, April 20, 2026

Live Video

spot_img

వర్చువల్‌గా కోర్టు విచారణకు హాజరైన అల్లు అర్జున్‌

టాలీవుడ్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నాంపల్లి కోర్టులో విచారణకు వర్చువల్‌గా హాజరయ్యారు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్యథియేటర్‌ దగ్గర తొక్కిసలాట కేసులో ఇవాళ న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ విచారణకు అల్లు అర్జున్‌ స్వయంగా కోర్టుకు హాజరవుతారని అందరూ అనుకున్నారు. కానీ, శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయన్న ఉద్దేశ్యంతో అల్లు అర్జున్‌ వర్చువల్‌గా విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలని ఆయన తరపు లాయర్లు న్యాయమూర్తిని అభ్యర్థించారు. న్యాయస్థానం సానుకూలంగా స్పందించడంతో అల్లు అర్జున్‌ వర్చువల్‌గా హాజరయ్యారు. అల్లు అర్జున్‌కు న్యాయస్థానం విధించిన 14 రోజుల రిమాండ్‌ ఇవాల్టితో పూర్తయ్యింది. మరోవైపు.. ఇదే కేసులో కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, అల్లు అర్జున్‌కు రెగ్యులర్‌ బెయిల్‌ ఇవ్వాలంటూ ఆయన తరపు లాయర్లు ఇవాళ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. మరోవైపు.. దీనిపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సమయం కోరారు. దీంతో, నాంపల్లి కోర్టు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com