ఈ యేడాది భారతీయ సినిమాలు చాలా వరకు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ఫ్యాన్స్‌ను నిరాశ పరిచాయి. వాటిలో చిన్న సినిమాలే కాదు.. భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఉండటం గమనార్హం. ఫలితంగా అంచనాలు తలకిందులై చాలా నిర్మాణ సంస్థలు నష్టాలు ఎదుర్కొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు 2024 చేదు సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ప్రదానంగా దక్షిణాదికి చెందిన అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలు పుష్ప-2, కల్కి గ్రాండ్ హిట్‌లు అందించినా దాదాపు మిగతా సినిమాలన్నీ అంచనాలను అందుకోలేక తలకిందులయ్యాయి.
పలువురు స్టార్లు నటించిన పెద్ద బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకులపై ప్రభావం చూపించడంలో విఫలమయ్యాయి. చివరికి బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఈ యేడాది ఫెయిల్ అయిన కొన్ని భారీ బడ్జెట్ సినిమాలేంటో చూద్దాం…
భారతీయుడు 2 :
1996లో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన భారతీయుడు సినిమా సీక్వెల్ కోసం దేశమంతా ఎదురుచూసింది. అయితే భారతీయుడు -2 సినిమా అభిమానుల్లో తీవ్ర నిరాశను మిగిల్చింది. సూపర్ స్టార్ కమల్ హాసన్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడే సేనాపతి పాత్రలో మళ్లీ నటించారు. సీక్వెల్‌పై విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. కానీ, దీనికి ప్రేక్షకుల నుండి ప్రతికూల రియాక్షన్ వచ్చింది. రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.148.33 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.
కంగువ :
శివ దర్శకత్వం వహించిన సూర్య హీరోగా నటించని కంగువ భారీ గ్రాఫిక్స్‌తో తెరకెక్కింది. ఈ యేడాది సినీ టీమ్ మాత్రమే కాదు.. సినీ ఇండస్ట్రీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ అంచనాలు పెట్టుకున్న ప్రాజెక్ట్‌లలో ఇది ఒకటి. ఈసినిమాలో బాబీ డియోల్ విలన్‌గా నటించారు. ఇది మరో బాహుబలి అని ప్రచారం కూడా జరిగింది, అయితే, రిలీజ్ తర్వాత ఫ్లాట్ అయ్యింది. రూ.350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం రూ.106.25 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.
బడే మియాన్ చోటే మియాన్ :
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తొలిసారి కలిసి నటించిన యాక్షన్ సినిమా బడే మియాన్ చోటే మియాన్. 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందించబడినప్పటికీ, ఈ సినిమా తొలిరోజు తర్వాత ప్రేక్షకులను థియేటర్‌లకు రప్పించడంలో విఫలమైంది. చివరికి రూ.111.49 కోట్ల రాబడులను మాత్రమే సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద తన వేగానికి ఫుల్‌స్టాప్ పెట్టింది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2024లో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.
లాల్ సలామ్ :
ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన, రూ.80-90 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడిన స్పోర్ట్స్ యాక్షన్ సినిమా ఇది. రజనీకాంత్ అతిధి పాత్ర ఆకర్షిచినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుండి మిశ్రమ రివ్యూలను అందుకుంది, ఇది దాని బాక్సాఫీస్ రన్‌ను ప్రభావితం చేసింది. ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ.17.46 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.32.65 కోట్లు మాత్రమే రాబట్టింది.
తంగలన్ :
విక్రమ్ సినిమా తంగలన్‌లో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్, డేనియల్ కాల్టాగిరోన్, పశుపతి, హరి కృష్ణన్‌లతో సహా సమిష్టి స్టార్ తారాగణంతో పాటు ఐదు పాత్రల్లో కనిపించాడు. నటీనటుల నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, చారిత్రక దోషాలు, విజువల్ ఎఫెక్ట్స్, స్క్రిప్ట్ రూపకల్పనపై విమర్శలు సినిమా బాక్సాఫీస్ రన్‌ను ప్రభావితం చేశాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.68 కోట్లను రాబట్టింది, సినిమా నిర్మాణానికి అయిన ఖర్చు రూ.150 కోట్లు తిరిగి రాబట్టడంలో విఫలమైంది.
బడే మియాన్ చోటే మియాన్ :
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తొలిసారి కలిసి నటించిన యాక్షన్ చిత్రం బడే మియాన్ చోటే మియాన్. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించబడినప్పటికీ, ఈ చిత్రం 1వ రోజు తర్వాత ప్రేక్షకులను థియేటర్‌లకు ఆకర్షించడంలో విఫలమైంది మరియు చివరికి రూ.111.49 కోట్లను మాత్రమే సంపాదించి బాక్స్ ఆఫీస్ వద్ద తన పరుగును ముగించింది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2024లో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.
సైంధవ్ :
వెంకటేష్ 75వ సినిమాగా తెరకెక్కిన సినిమా సైంధవ్ మార్క్. ఈ సినిమాపై మొదటినుంచీ భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ వెంకటేష్, ఆర్య, నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి స్టార్ పెర్ఫార్మర్స్ ఉన్నప్పటికీ, పేలవమైన స్క్రిప్ట్, డైరెక్షన్ కారణంగా ప్రేక్షకుల నుండి ఆదరణ దక్కలేదు. మొదటి వారంలోనే బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. రోజువారీగా చూస్తే.. కోటి రూపాయల కంటే తక్కువ గానే వసూళ్లు వచ్చాయి, రూ.55 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.18 కోట్లు మాత్రమే రాబట్టింది.
డబుల్ ఇస్మార్ట్ :
దర్శకుడు శంకర్ హిట్ సినిమా ఇస్మార్ట్‌కు సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కించారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్‌గా, రామ్ పోతినేని హీరోగా నటించారు. అయితే, ఈ సినిమా విడుదలైన తర్వాత నెగెటివ్ రివ్యూలు వచ్చాయి.ఫలితంగా విడుదలైన పది రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అన్ని థియేటర్ల నుంచి ఈ సినిమా అంతర్ధానమయ్యింది. బ్లాక్ బస్టర్ అంచనాలు పెట్టుకున్న సినిమా నిర్మాతలకు ఈ పరిస్థితులు షాక్ ఇచ్చాయి. రూ.90 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.19 కోట్లు మాత్రమే రాబట్టుకుంది.
మిస్టర్ బచ్చన్ :
ఈ ఏడాది రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ మరో పెద్ద నిరాశను మిగిల్చింది. అజయ్ దేవగన్ హిట్ సినిమా రైడ్‌కు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా ఇండిపెండెన్స్ డే నాడు రిలీజ్ అయ్యింది. డబుల్ ఇస్మార్ట్‌తో పోటీ పడింది. అయితే ఆ సినిమా మాదిరిగానే మిస్టర్ బచ్చన్‌కు కూడా ప్రతికూల సమీక్షలే ఎదురయ్యాయి. ప్రేక్షకులను అలరించడంలో ఈ సినిమా వైఫల్యంచెందింది. రెండోరోజు నుంచే బాక్సాఫీస్ కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. చివరికి, ఈ సినిమా భారీ బాక్సాఫీస్ బాంబ్ అయ్యింది. రూ.70 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన మిస్టర్ బచ్చన్ ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.13.5 కోట్లు మాత్రమే వసూళ్లు చేసింది.