36.2 C
Hyderabad
Monday, April 20, 2026

Live Video

spot_img

కానిస్టేబుల్ వేధింపులతో యువతి ఆత్మహత్య

నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కానిస్టేబుల్ వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పరిశోధనా విద్యార్థిని అయిన దీప్తి హబ్సీగూడ ఐఐసీటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. అదే ఐఐసీటీలో పనిచేసి పదవీ విరమణ పొందిన దీప్తి తండ్రి సంగీత్ రావు ఉద్యోగం ఇప్పిస్తానని అనిత అనే ఓ మహిళ నుంచి 15 లక్షల రూపాయలు తీసుకున్నారు. అయితే ఉద్యోగం ఇప్పించకపోవడంతో ఆ మహిళ భర్త డీజీపీ కార్యలయంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అనిల్ డబ్బులు తిరిగి ఇవ్వాలని దీప్తిపై ఒత్తిడి తేవడవం ప్రారంభించాడు. అయితే డబ్బులు తన తండ్రి తీసుకున్నాడని ఆయన చాలా కాలంగా తమతో ఉండటం లేదని దీప్తి ఎంత చెప్పినా వినకుండా ఆమెపై తన భార్య అనితతో నాచారం పోలీస్ స్టేషన్లో సంగీత్ రావు, దీప్తిలపై ఫిర్యాదు చేయించాడు అనిల్. నాచారం పోలీసులు వీరిద్దరిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో అనిల్, అనితలు న్యాస్ధానంలో సివిల్ దావా కూడా వేశారు. దీంతో మనస్తాపం చెందిన దీప్తి బుధవారం రాత్రి సెల్ఫీ వీడియో తీసుకుని అనంతరం ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నా మరణానికి అనిల్, ఆయన భార్య అనిత, ఆమె తండ్రి సోమయ్య కారణమని నాన్న డబ్బు తీసుకుంటే నామీద నకిలీకేసు నమోదు చేయించి జీవితాన్ని నాశనం చేశారని విలపిస్తూ దీప్తి ఆత్మహత్యకు ముందు సెల్పీ వీడియో తీసుకుననారు. దీప్తి ఆత్మహత్య వ్యవహారంలో నాచారం పోలీసులు అనిత, అనిల్, సోమయ్య, సైదులపై కేసు నమోదు చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com