28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

8వ వేతన సంఘం ఏర్పాటయ్యేదాకా ఏఐఆర్‌ఎఫ్‌ పోరాటం – జాతీయ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా

– ఘనంగా మజ్దూర్ యూనియన్ విజయోత్సవ ర్యాలీ
– రైల్‌నిలయం దాకా ఊరేగింపు
– కదంతొక్కిన వేలాది మంది కార్యకర్తలు

దేశ వ్యాప్తంగా జరిగిన ట్రేడ్ యూనియన్ ఎన్నికలలో ఏఐఆర్‌ఎఫ్‌ 13 జోన్ లలో గెలిచి దేశంలోనే నెంబర్ 1 గా అలాగే, సికింద్రాబాద్ జోన్ లో కుడా మజ్దూర్ యూనియన్ అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్బంగా మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సికింద్రాబాద్‌లోని మజ్దూర్ యూనియన్ కేంద్ర కార్యాలయం నుండి రైల్ నిలయం వరకు వేలాది మంది కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ డప్పు వాయిద్యాలు మహిళా నృత్యాలు ఆనందోత్సాహల మధ్య ఉత్సాహంగా కొనసాగింది. మజ్దూర్ యూనియన్ కేంద్ర కార్యాలయం నుండి లేఖ భవన్, హైదరాబాద్ భవన్, రైల్ నిర్మాన్ భవన్, సంచలాన్ భవన్ మీదుగా రైల్ నిలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంకు మజ్దూర్ యూనియన్ జోనల్ ప్రెసిడెంట్ కామ్రేడ్ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా, సికింద్రాబాద్ జోన్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రెటరీ శంకర్ రావు ముఖ్య అతిదులుగా హాజరయ్యారు ఈ సందర్బంగా ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రెటరీ శివగోపాల్ మిశ్రా మాట్లాడుతూ… 8 వేతన సంఘం అమలు చేసే వరకు పోరాటం పోరాటం చేస్తామని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం పని చేసాం కాబట్టే దేశంలోనే అత్యధికంగా 13 జోన్ లలో కార్మికులు గెలిపించి దేశంలో నెంబర్ వన్ ట్రేడ్ యూనియన్ గా ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ కు పట్టం కట్టారని అన్నారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తామని అన్నారు రిస్ట్రక్షారింగ్ లో కార్మికులకు మెరుగైన పదోన్నతులు దక్కేలా కృషి చేస్తామని అన్నారు.. యునైటెడ్ పెన్షన్ స్కీంలో మార్పులు వచ్చేలా చేస్తామని పాత పెన్షన్ స్కీమ్ మాదిరి అవకాశాలు కలిగేలా చేస్తామని అన్నారు. దేశంలో నెంబర్ వన్ యూనియన్ గా గెలిపించిందుకు కార్మకులకి ధన్యవాదములు తెలిపారు.. ఈ కార్యక్రమంకు హాజరైన జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్ ఎన్నికలలో మజ్దూర్ యూనియన్ అత్యధిక ఓట్లతో గెలిచినందుకు యూనియన్ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ జోనల్ అధ్యక్షులు కాల్వ శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ శంకర్ రావు, అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీ ఉదయభాస్కర్, శ్రీనివాస్ రెడ్డి, భారతి, రామకృష్ణ, జోనల్ కోశాధికారి సరోజినీ రెడ్డి, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మురళీధర్, సికింద్రాబాద్ డివిజనల్ సెక్రెటరీ రవీందర్, హైదరాబాద్ డివిజనల్ సెక్రెటరీ కృష్ణా, EDB డివిజనల్ సెక్రెటరీ సంజీవయ్య,వర్క్ షాపు డివిజనల్ సెక్రెటరీ బుచ్చి రెడ్డి, డివిజనల్ ప్రెసిడెంట్ లు వరప్రసాద్, ఖాజబాబా, మంజులత,సిసిఎస్‌ ప్రెసిడెంట్ చిలుకు స్వామి తదితరులు పాల్గొన్నారు

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com