24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

అవినీతి జరిగితే ఎందుకు రద్దు చేయటం లేదు…కెటిఆర్

హెఎచ్ డి ఎం చేసే ప్రతి పనికి ప్రభుత్వ అనుమతులు అవసరం లేదని.. దానికి అ మేరకు స్వేచ్ఛ ఉందని బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ అన్నారు. హెచ్ ఎండిఏ ఒక కార్పోరేషన్ చట్టంలోనే హైదరాబాద్ నగర ప్రగతికి పనికి వచ్చే ఏ కార్యక్రమానికైన డబ్బులు ఖర్చు చేయవచ్చని ఉందన్నారు. అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ చేసిన కెటిఆర్…వివిధ ఆంశాల్ని ప్రస్తావించారు.

కెటిఆర్ మాటల్లోనే…

పొన్నం మాటలతో ఈకార్ రేసు వ్యవహారంలో అవినీతి లేదని తేలింది. ముఖ్యమంత్రా… లేదా ఇతరులెవరైనా మంత్రులా.. కొంత మంది సైకోలు ఎవరు తప్పుదొవ పట్టిస్తున్నారో తెలవాలి. క్వాష్ పిటిషన్ వేశాం, లంచ్ మోషన్ పైన కోర్టు తెలుస్తుంది.

ఈ కేసులో అణాపైసా అవినీతి లేదు… అయినా ప్రభుత్వం కేసు పెట్టాలని ముందుకు పోతే వాళ్ల ఇష్టం
న్యాయ పరంగా ఎదుర్కుంటాం.

ఒఅర్ అర్ రోడ్డు లీజు.. సిట్ ఎర్పాటుపైన కెటిఅర్ కామెంట్స్

టి ఓ టి దేశంలో ఇప్పటికే అమలులో ఉంది. టి ఓ టి విధానంలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నుంచి వచ్చిన డబ్బులను రైతు రుణమాఫీకి ఉపయోగించాం. ఆర్థిక వనరుల సమీకరణపైన అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ అనేక సూచనలు ఇచ్చింది. అమెరికా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి డబ్బులు సేకరించవచ్చు అని సూచించింది.

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారులు నుంచి డబ్బులు సేకరిస్తున్న టివోటి విధానంలోనే అవుటర్ రింగ్ రోడ్డు నుంచి డబ్బులను సేకరించాం. ప్రయివేట్ కంపెనీకి లబ్ది చేకూర్చినట్టు అరోపిస్తున్న రేవంత్ అ కంపెనీతో లీజుని ఎందుకు రద్దు చేయడం లేదు.

గతంలో అవుటర్ రింగ్ రోడ్డు లీజుపైన రేవంత్ రెడ్డి మాట్లాడిన లక్ష కోట్ల అవినీతి అడ్డగోలు మాటలు పైన హెచ్ఎండిఏ పరువు నష్టం కేసు వేసింది. ఇప్పటికీ రేవంత్ రెడ్డి పైన హెచ్ఎండిఏ వేసిన కేసు అలాగే ఉంది. ముఖ్యమంత్రి ఔటర్ రింగ్ రోడ్డు పైన అనేకసార్లు కుంభకోణం అని మాట్లాడారు.

మరి కుంభకోణం జరిగిందంటున్న అవుటర్ రింగ్ రోడ్డు లీజ్ ను ఏందుకు రద్దు చేయడం లేదు. రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ, హోంశాఖ మంత్రిగా ఉన్నారు… ఇలాంటి సందర్భంలో సిట్ ద్వారా తన కింద ఉన్న అధికారులతో వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి.

తన సొంత శాఖ అధికారులతో దర్యాప్తు చేస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయో రేవంత్ చెప్పాలి. అందుకే ఔటర్ రింగ్ రోడ్డు లీజనింగ్ వెంటనే రద్దుచేసి… సిట్టింగ్ జడ్జితో కానీ రిటైర్డ్ జడ్జితో కానీ నిష్పాక్షిక విచారణ జరగాలి. ఒకవేళ కుంభకోణం జరిగిఉంటే ఆయాచితంగా లబ్ధి జరిగిన కంపెనీని కాంట్రాక్టు ఎందుకు రద్దు చేయడం లేదో వెల్లడించాలి.

సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయించకుంటే ఇది మరొక రాజకీయ కక్ష సాధింపు కేసు అని ప్రజలు అనుకుంటారు. జడ్జ్ ఏర్పాటు చేసే బృందం జాతీయ రహదారుల సంస్థ విధానాలను అధ్యయనం చేయాలని కూడా సూచిస్తాం. మాపై ఆరోపణలు చేసి కక్ష సాధింపుల కోసం మాత్రమే పరిమితం కాకుండా వాస్తవాలు తెలిసేలా మాట్లాడాలి. పదివేల కోట్ల రూపాయల కోకాపేట కుంభకోణం అంటున్న భూముల అమ్మకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com