బీజేపి సీనియర్ నేత ఎల్ .కె.అద్వానీ ఆస్పత్రి పాలయ్యారు. గత రాత్రి ఆయన ఆరోగ్యం వికటించి తీవ్ర అస్వస్థత పాలవడంతో ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో ఆయన జాయిన్ అయ్యారు. వాస్తవానికి గత నెల లో ఆయన 97వ పుట్టిన రోజు తర్వాత నుంచి ఆయన ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ ఏడాది జులై నెల తర్వాత ఆయన ఆస్పత్రి పాలవడం ఇది నాల్గవ సారి. ఈమధ్యనే ఆరోగ్యసమస్యలు తలెత్తడంతో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు.
1927 నవంబర్ 8న కరాచీలో పుట్టిన అద్వానీ 1942 లో ఆరెస్సెస్ లో చేరారు . అప్పటి నుంచి బీజేపి కీలక నేతగా కొనసాగుతున్నారు. బీజేపికి అధ్యక్షత వహించిన సీనియన్ నేత కూడా ఆయనే. రథయాత్రతో దేశంలో హిందూ సమాజాన్ని ఒక్క తాటిపైకి తెచ్చిన ఘనుడు. వాజిపేయి ఎన్డీఏ ప్రభుత్వంలోనూ హోం మంత్రిగా, డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ ఏడాది మార్చిలోనే ఆయన భారత రత్న పురస్కారం కూడా అందుకున్నారు.అద్వానీ త్వరగా కోలుకోవాలని బీజేపి సీనియర్ నేతలు ఆకాంక్షించారు.
క్షీణించిన అద్వానీ ఆరోగ్యం.. ఆస్పత్రిలో చేరిక
- Advertisement with us -