24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

ఈ చట్టం గురించి మీకు తెలుసా?

21వ శతాబ్దం మహిళల జీవితాల్లో ఎన్నో మార్పులు తెచ్చింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడంతో మహిళలు కూడా చాలా వేగంగా దేశ ఆర్థికపురోగతిలో భాగస్వాములవుతున్నారు. అయితే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించేందుకు మన ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్నే చేసాయన్న అవగాహన చాలా మంది మహిళలకు లేదు. అయితే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టం ఏంచెబుతోందంటే..

పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 ఇది భారత దేశం అంతటా వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వ అధికారిక గెజిట్ లో నోటిఫికేషన్ ద్వారా దీని అమలు జరుగుతోంది. పబ్లిక్ ,ప్రైవేట్ సంస్థలు లేదా ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళలకు,  ఈ చట్టం ద్వారా రక్షణ కల్పించవచ్చు. అయితే దానికి కొన్ని నిబంధనలున్నాయి.

ఏం చేయాలి?

ఈ చట్టం ప్రకారం ప్రతీ కార్యాలయంలోనూ మహిళా విభాగాలకు ప్రత్యేక లైంగిక వేధింపుల నిరోధక కమిటీ ఉండాలి. ఇందులో ఇంటర్నల్, ఎక్సటర్నల్ మెంబర్స్ సభ్యులుగా ఉంటారు. సాధారణంగా అదే కార్యాలయంలో సీనియర్లు, ఈ చట్టాలపైన అవగాహన కల్పించబడిన వారు మహిళల భద్రతపై అనేక చర్యలను కార్యాలయాలకు సిఫారసు చేస్తారు. సంస్థ ఇంటర్నల్ కమిటీలో కనీసం ఇద్దరు సీనియర్లు ఉంటారు. బయట ఏ సంస్థకు సంబంధం లేని మహిళా చైతన్య వేదికలు లేదా, ప్రొఫెసర్లు, లేదా స్త్రీల హక్కులపై అవగాహన ఉన్న, ఉన్నత  స్థాయి మహిళలు ఈ చట్టంపై  అవగాహన కలిగి ఉన్న వారు కనీసం ఒకరు లేదా ఇద్దరు సభ్యులుగా ఉంటారు. వీరంతా మూడేళ్లపాటు ఆ పదవిలో ఉంటారు. ప్రతీ మూడు నెలలకు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ మహిళా సిబ్బందికి చట్టాలపై అవగాహన కల్పిస్తూ, వారి ఫిర్యాదులు సమస్యలను పరిశీలిస్తూ ఉంటారు.

ప్రతీ కార్యాలయం ఆ సూచనలను పాటిస్తూ ఈ  చట్టం పై మహిళలకు అవగాహన కల్పించి, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ తమ విధి నిర్వహణ చేస్తుంటారు.  ఈ సభ్యులకు తగిన గౌరవ వేతనం కూడా కార్యాలయమే కల్పించవలసి ఉంటుంది.వేధింపులు ఎదుర్కొనే వారు  ఈ ఇంటర్నల్ కమిటీకి తమ ఆరోపణలను ఇవ్వచ్చు.   అప్పుడు ఈ కమిటీ వాటిని అధ్యయనం చేసి   ఆ ఆరోపణలను నిర్ధారిస్తుంది.  ఆరోపణలు రుజువైతే ఆరోపణలెదుర్కొంటున్న వ్యక్తిని ఉద్యోగంలోంచి తీసివేయడం లాంటివి చేస్తారు. వారు చేసిన నేర తీవ్రత ఆధారంగా కఠినమైన జైలు శిక్షలు, పెనాల్టీ ,  కూడా ఉంటుంది. నేరస్తుడు మరెక్కడా ఉద్యోగం చేయలేని పరిస్తితి కలుగుతుంది.

కమిటీ సభ్యులపై ఆరోపణలొస్తే..

ఇంటర్నల్, ఎక్స్టటర్ నల్ కమిటీ సభ్యులపై అవినీతికి పాల్పడినట్లు, లేదా లంచాలు తీసుకున్నట్లు, లేదా నేరం ఆరోపించబడిన వ్యక్తి కొమ్ముకాసినట్లు,  వారు కల్పించే ప్రయోజనాలకు అంగీకరించినప్పుడు, లేదా ఈ చట్టంలోని కమిటీ నియామకానికి సంబంధించిన 16వ క్లాజ్  నిబంధనలను అతిక్రమించినప్పుడు వారిని ఆ పదవినుంచి తొలగించి.. వారి స్థానంలో  మరొకరికి నిబంధనల ప్రకారం అనుమతి కల్పిస్తారు.

లైంగిక ఆరోపణలంటే?

మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 చాలా పకడ్బందీగా రూపొందింది.  మహిళలపై లైంగిక వేధింపులకు చాలా విస్త్రుతమైన నిర్వచనమే ఇచ్చింది. లైంగిక  వేధింపులంటే కేవలం కేవలం శారీరక వేధింపులే కాదు, మానసికంగా వేధించినా  అదీ వేధింపుల కిందకే వస్తుంది.

పై అధికారి అసభ్యకర పదజాలంతో, దూషణలకు పాల్పడినా..

కవ్వింపు చర్యలు, కావాలని తాకడం,  బూతు సందేశాలు పంపడం, కంటి సైగలు, చేతి స్పర్శ, వెర్బల్ సంకేతాలు,  ఇలా మహిళల డీసెన్సీని, డిగ్నిటీని భంగపరిచే ఎలాంటి అభ్యంతరకర చర్యలైనా ఈ చట్టం ప్రకారం వేధింపుల కిందకే వస్తాయి. పదోన్నతి కల్పించేందుకు అభ్యంతరకర ప్రయోజనాలు నెరవేర్చమని డిమాండ్ చేయడం లేదా ఉద్దేశ పూర్వకంగా దగ్గరగా మసలు కోవడం, అడగని ఫేవర్లు ప్రయోజరాలు కూడా కల్పించేస్తూ ఇబ్బంది పెట్టడం అకారణంగా పదోన్నతులు, లాభాలు కల్పిస్తూ, అందరికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి స్పెషల్ ట్రీట్ మెంట్ కల్పించి వశపరుచుకునే ప్రయత్నం చేయడం. తనకు లొంగక పోతే పదోన్నతులు, బదిలీలు, ఇంక్రిమెంట్లు, ఇతర సభ్యులతో సమానంగా కల్పించే ప్రయోజనాలను నిలిపివేయడం. పదేపదే మహిళల  డిగ్నిటీని భంగపరిచే విధంగా ఉద్దేశ పూర్వకంగా వేధింపులకు పాల్పడటం..  అందరి ముందు అవమానాల పాల్జేయడం లాంటి సమస్యల నుంచి కూడా మహిళలకు ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది.

బాధిత స్త్రీ అంటే ఎవరు?

కార్యాలయంలో, లేదా ఏదైనా సంస్థలో లేదా బయట  వేధింపులకు ఎవరైనా మహిళ గురయితే… పై అధికారులు, సహచర సిబ్బంది, కింది స్థాయి సిబ్బంది  లేదా  వ్యక్తి చేత లైంగిక వేధింపులకు బలయిన వారు. ఇంట్లో పనిచేసే మహిళ అయినా, లేదా ఏదైనా ఇంటి పరిధిలో పనిచేసే ఏ వయసు స్త్రీ అయినా, యజమానుల ఇళ్లలో పనివారుగా పనిచేస్తూ లైంగిక ఒత్తిళ్లు, వేధింపులు ఎదుర్కొనే మహిళలు.. ఉన్నతాధికారి నుంచి క్లాస్ ఫోర్ ఎంప్లాయీ అయినా.. బాధిత స్త్రీ కావొచ్చు

పని ప్రదేశాలు అంటే..

లైంగిక వేధింపుల నిరోధక చట్టం దీనికి కూడా స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది.ప్రభుత్వంతో లేదా ప్రభుత్వ సంస్థతో,ప్రత్యక్టంగా లేదా పరోక్షంగా సంబంధమున్నకార్పొరేషన్ లేదా కో ఆపరేటివ్ సొసైటీ… ఇలా  ఏదైనా సంస్థ, అండర్ టేకింగ్, ఎస్టాబ్లిష్మెంట్, ఎంటర్ ప్రైజ్, ఇనిస్టిట్యూషన్,  బ్రాంచ్.. ఏదైనా.. పని ప్రదేశం కిందకే వస్తుంది. అలాగే ప్రైవేట్ సెక్టర్ , అండర్ టేకింగ్, ఇనిస్టిట్యూషన్,ఎస్టాబ్లిష్ మెంట్, సొసైటీ, ట్రస్ట్,ప్రభుత్వేతర సంస్థ, యూనిట్, లేదా సొసైటీ, కమర్షియల్, ఎడ్యుకేషనల్, ఒకేషనల్,ఇండస్ట్రియల్, హెల్త్ సర్వీసులు, లేదా ప్రొడక్షన్, సప్లయ్, డిస్ట్రిబ్యూషన్, సేల్స్ సర్వీస్  ప్రొవైడర్ ఇలా అన్నీ ఈ పరిధిలోకే వస్తాయి. పది మంది కన్నా తక్కువ లేదా ఎక్కువ ఉన్న అవ్యవస్థీక్రుత రంగ మహిళలకు కూడా ప్రైవేట్  సంస్థల్లో కూడా ఈ రక్షణ కల్పించాల్సి ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com